ఒక్కటే ఇండియా ఉందిరా… అంటున్న బన్నీ

285
Allu Arjun
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసింది. ఈ చిత్ర యూనిట్ బన్నీ బర్త్‎డే సంబర్భంగా డైలాగ్ ఇంపాక్ట్ పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ … అన్ని ఇండియాలు లేవురా మనకి ఒక్కటే ఇండియా అంటూ బన్నీ చెప్పే ఆ ఒక్క డైలాగ్ అభిమానులను విపరీతంగా అలిస్తుంది.

ఇప్పటికే బన్నీ ఆర్మీ ఆఫీసర్‎గా నయా లుక్స్‎తో ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు. ఇక ఈ రోజు విడుదలైన డైలాగ్ ఇంపాక్ట్‎తో బన్నీ అభిమానులలో కొత్త ఉత్సాహం వచ్చింది. మే 4న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ కసరత్తులు చేస్తుంది. అను ఎమ్మాన్యుయేల్ కథానాయికగా, యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తెలుగులోని కాక పలు భాషలలో ఈ మూవీ విడుదల కానుంది. కే.నాగబాబు, పి.వాసు సహ నిర్మాతలుగా రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శ్రీషా శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. విశాల్‌–శేఖర్‌ ద్వయం సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర తమిళ వర్షన్‌కు గీతరచయిత పా.విజయ్‌ సంభాషణలను అందిస్తున్నారు .ఎన్‌ పేరు సూర్య ఎన్‌ వీడు ఇండియా అనే పేరుతో ఈ మూవీ కోలీవుడ్‌లో విడుద‌ల కానుంది.

- Advertisement -