సల్మాన్‌ కు బెయిల్‌..

222
Salman Khan granted bail in Blackbuck case
- Advertisement -

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌కు బెయిన్‌ మంజూరైంది. జోధ్‌పూర్‌ కోర్టు సల్మాన్ కు షరతులతో కూడిన బెయిలిచ్చింది. కృష్టజింకల వేట కేసులో ఐదేళ్ళు జైలు శిక్ష పడ్డ సల్మాన్‌ను గత రెండు రోజుల క్రితం పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత జోధ్‌పూర్‌ జైలుకు తీసుకెళ్ళారు.

Salman Khan granted bail in Blackbuck case

కాగా..ఇవాళ బెయిల్ పిటీషన్‌ పై విచారణ జరిపిన అనంతరం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. అయితే ఇవాళ బెయిల్‌ అంశంపై కొంత ఉత్కంఠ నెలకొంది. గత రాత్రి రాజస్థాన్‌ ప్రభుత్వం 87 మంది జడ్జీలను అకస్మాత్తుగా బదిలీ చేసింది. అందులో సల్మాన్‌ కేసును విచారిస్తున్నజడ్జి రవీంద్ర కుమార్ జోషి కూడా ఉన్నారు. కానీ చివరికి 50వేల పూచీకత్తుపై సల్మాన్‌ కు బెయిలిచ్చారు.

ఇదిలా ఉండగా 20 ఏళ్ళ క్రితం ఓ షూటింగ్‌ కోసలం జోధ్ పూర్‌ వెళ్ళిన సల్మాన్ ఖాన్‌ మిగతా నటీనటులతో కలిసి అక్కడ జింకల వేటా చేశారు. అయితే ఈ కేసులో మిగతా నటీనటులకు నిర్థోషులుగా తేల్చిన జోధ్‌పూర్‌ కోర్ట్‌..సల్మాన్‌ ను దోషిగా తేల్చింది.

- Advertisement -