ఏందిరా భాయ్… ఈ సెల్లు లొల్లి

270
your phone harm your health
- Advertisement -

సిగరేట్ త్రాగడం ప్రాణాలకు ముప్పు…ఇది థియేటర్,బస్టాండ్,యాడ్స్ లో మనకు కనిపించేది. కానీ ఇప్పుడు సెల్ ఈజ్ ఇన్ జ్యూరియస్ టు హెల్త్ అనేలా ఉంది. ఎందుకంటే  ఇయాల్ల, రేపు పోరగాళ్లు ఎట్లున్నరు.. జేబుల రూపాయి లేకున్న.. చేతుల పట్టుకోని తిరిగేందుకు సెల్ ఫోన్ ఉండాలే.. సెడ్డిలేసుకునే పోరగాని కాంచేలి ముసలొల్ల దాకా అందరు టిక్క టిక్క ఒత్తుకుంట సెల్ ఫోన్లన్ల మాట్లాడుడేనాయే.. ఒక్కొక్కల దగ్గర రెండు మూడు ఫోన్లు కూడా ఉండవట్టే. ఈ స్కూల్ కుపోయే పోరని కాన్నుంచి మొదలుపెడితే సాప్ట్ వేర్ జాబ్ చేసేటోళ్లదాకా అందరు ఎప్పుడు జూసిన మొఖాలు పోన్లనే పెడుతున్నరట.. పొద్దుగాల లేచిన కాన్నుంచి.. రాత్రి పండుకునే దాకా వాట్సాప్ లు, ఫేస్ బుక్ లు, ట్విట్టర్ లు, స్కైప్ లల్లనే ముఖం పెడుతున్నరట…. మునిగి తేలుతున్నరట. యూత్ మొత్తం 47 శాతం వాట్సాప్, ఫేస్ బుక్ లల్లనే ఉంటున్నరని లెక్కలు జెప్పుతున్నయి. మనిషి బతికేదే అతికష్టమ్మీద 60 ఏండ్లు.. దాంట్ల సగం కాలం నిద్రపోవడానికే పోతది.. ఇంకా సగం వాట్సాప్ ల ఫోట్వలు పెట్టుడు… అవ్వోటి ఇవ్వోటి రాసుడే చెస్తున్నరట. సెల్ ఫోన్లు మనిషితోటి ఎట్ల ముడిపడి ఉన్నయో.. సెల్ ఫోన్ల మీద ఎటువంటి కామెంట్లు వస్తున్నయో నేను చెప్ప మీరే చూడుర్రి…

*నిద్ర*= కళ్ళు ముసుకుంటే రాదు
*Net* Off చేస్తే వస్తుంది
___________

ఆకలితో ఉన్నవాడికి అన్నం
Android ఫోన్,
వాడికి charger ఇవ్వడం పుణ్యకార్యం
____________
కోన్నిరోజుల ముందు వరకు అందరు *బేటా* కొరకు ఎదురుచుశాం,
ఇప్పుడేమొ *Data* కొరకు
_______________

Phone పాడైతే పిల్లలు చేసారంటాం,
పిల్లలు పాడైతే Phone కారణం అంటాం.
___________
ఒకప్పుడు ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు *పెద్దవాళ్ళ ఆశీర్వాదం* తీసుకుని వెళ్ళేవాళ్ళం,

ఇప్పుడేమొ *ఫోన్ బ్యాటరీ ఫుల్* చేస్కోనీ వెళతాం
_________
Suddenly phone balance ఐపోతే,
మనం మాట్లాడాల్సిన ఆవతలి వ్యక్తి
భూమ్మీద దొరుకుతాడో లేదో అనేంత కంగారు పడిపోతాం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Battery low అయి 1%లేదా 2% మీద ఉందనుకోండీ అప్పుడు చూడాలీ,
చార్జర్ వైపు ఎలా పరుగెడతామంటే
ఉహించుకోండి….

కొందరు phone pattern password ఎలా set చేస్తారంటే,
వామ్మొ…..
దాంట్లో ఎదో ISI పత్రాలు దాచుకున్నట్టు..

అనుకోకుండా ఫోన్ మిత్రుల దగ్గర మరిచిపోయినమనుకో…..
మన అమాయక ప్రేయసీనీ శక్తీమాన్ దగ్గర వదిలేసినట్టు అన్పిస్తుంది..
౼౼౼౼౼౼౼౼౼౼౼

Mobile company వాళ్ళతో ఒక request ఏంటంటే pls phone back side లో ఒక చిన్న lunch box తయారు చేసేయ్యండీ
“”””””””””””'””””””””””””””””””
.
.
……..
పెళ్లి మండపంలో వంచిన తల ఎత్తకుండా అరగంట నుండి కూర్చున్న పెళ్ళి కూతుర్ని చూసి ముగ్దురాలైన కాంతం..
“ఏమండీ ..అమ్మాయిని చూసారా .ఏమి సంస్కారం ..ఏమి ఒద్దిక ,పొందిక .ఈకాలంలో కూడా ఇలా గంటల తరబడి తలొంచుకుని కూర్చునే ఆడపిల్ల దొరకడం అదృష్టమే ” అంది భర్తతో .
“సంస్కారమా మునక్కాయా ..జాగ్రత్తగా చూడు .పెళ్లికూతురు నెట్ ఆన్ చేస్కుని ఫేస్ బుక్ ,వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ బిజీగా ఉంది .”

- Advertisement -