ఇస్రో ‘జీశాట్-6ఏ’ ప్రయోగం విజయవంతమైంది. ఇవాళ సాయంత్రం 4:56 గంటలకు శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్08 రాకెట్ ద్వారా దీనిని నింగిలోకి పంపారు.
అయితే ప్రయోగించిన 17 నిమిషాల 46సెకన్లలోనే రాకెట్ నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. ఇస్రో ఛైర్మన్ కే శివన్ ఈ ప్రయోగాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.
కాగా..ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఆయనతో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. జీశాట్-6ఏ ఉపగ్రహం జీశాట్-6ను పోలి ఉంటుందని, అయితే ఇందులో కొన్ని మార్పులు చేశామని ఇస్రో అధికారులు చెప్పారు. రాకెట్ రెండో దశలో అధిక విస్పోటనం కలిగిన వికాస్ ఇంజిన్, ఎలక్ట్రోమెకానికల్ ఆక్టేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా..ఈ ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించి 27 గంటల కౌంట్‌డౌన్ బుధవారం మధ్యాహ్నం 1:56 గంటలకు ప్రారంభమైంది.
#WATCH: ISRO's launches GSLV-F08 carrying the #GSAT6A communication satellite from Satish Dhawan Space Centre (SDSC) in Sriharikota, Andhra Pradesh. pic.twitter.com/m7qum0DnkA
— ANI (@ANI) March 29, 2018