రానున్న వేసవి కాలంలో రాజధాని నగరంలో ఏలాంటి తాగునీటి కష్టాల రాకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కెటి రామరావు తెలిపారు.ఈ రోజు శాశన సభ హాలులో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి రాజధానిలో తాగునీటి సరఫరా, వేసవి కాల ప్రణాళికపైన మంత్రి, మేయర్ బొంతు రామ్మోహాన్తో కలిసి జలమండలి, జియచ్ యంసి అధికారులతో ఉన్నత స్ధాయి సమీక్షించారు. గతంలో కన్నా ప్రస్తుతం నగరంలో తాగునీటి కష్టాలు తగ్గాయన్న మంత్రి, ఈ సంవత్సరం మరింత మెరుగైన నీటి సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం క్రిష్ట, గోదావరి ప్రాజెక్టుల నుంచి నగరానికి సరిపడా నీటి సరఫరా జరుగుతున్నదని, గత ఏడాదితో పొల్చితే 100 యంఏల్ డిల నీటి సరఫరా సామార్ధ్యాన్ని జలమండలి చేకూర్చుకున్నదని మంత్రికి అధికారులు తెలిపారు. ఈ నీటి వనరులన్నీంటి నుంచి నగరంలో ఏక్కడికైనా నీరు సరఫరా చేసేందుకు అవసరం అయిన ఇంటర్ గ్రిడ్ కనెక్టీవీటి కోసం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని మంత్రి అదేశించారు. ఈ మాస్టర్ ప్లాన్ లో నగర నీటి సరఫరా కోసం ఉద్దేశించిన రెండు రిజ్వాయర్లను సైతం పరిగణలోకి తీసుకోవాలన్నారు. మెత్తం నగరానికి అన్నీ నీటి వనరుల నుంచి సూమారు 600 యంయల్ డిల నీటి సరఫరాకు అవకాశం ఉన్నదని తెలిపారు. సూమరు 120 బస్తీలను వాటర్ ట్యాంకర్ ఫ్రీ నీటి సరఫరా చేసేందుకు 15 కోట్లతో నీటి సరఫరా వ్యవస్ధ తాలుకు పనులను చేపట్టామని, దీంతో సూమారు 30 వేల కుటుంబాలకు ఈ వేసవి నీటి సరఫరా కష్టాలు లేకుండా చూస్తున్నామన్నారు.
శివారు మున్సిపాలిటీల్లో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టుల పనులను మంత్రి సమీక్షించారు. ప్రాజెక్టలో భాగంగా చేపడుతున్న రోడ్డు తవ్వకాలపైన ప్రజల నుంచి పలు పిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వేంట వేంటనే రోడ్డు రిస్టోరేషన్ పనులు పూర్తి చేయాలన్నారు.
ఈ వేసవి కాలంలో నగరంలో సాద్యమైనన్ని ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్ట నున్నట్లు మంత్రి తెలిపారు. ముందుగా ప్రగతి భవన్ నుంచి మెదలుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడుగుంతల నిర్మాణానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా అదేశాలిచ్చేలా అయన్ను కోరతామన్నారు. తాము చేపట్టిన జలం జీవం కార్యక్రమంలో ప్రలజను మరింత భాగస్వాములను చేసేల పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. జలం జీలం కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న రెయిన్ వాటర్ హర్వేస్టింగ్ థీమ్ పార్కు జూన్ మెదటి వారం నాటికి రెడీ అవుతుందన్నారు. వాన నీటి సంరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన జలం జీవంలో పెద్ద ఎత్తున పాల్గోనాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు.