తండ్రికి తగ్గ తనయుడిగా సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ సత్తాచాటిన యంగ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్చరణ్. ఈ రోజు ఈ చిరుత బర్త్డే. 2007లో పూరి దర్శకత్వంలో వచ్చిన చిరుతతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చెర్రీ….రెండో సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. తెలుగు సినిమా స్థాయిని ‘మగధీర” తో వసూళ్ళ పరంగా వందకోట్లకు పెంచిన చరణ్ ..అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. తన ఆట, పాటలతో మెగా అభిమానులను అలరిస్తున్నాడు.
తర్వాత ‘బొమ్మరిల్లు’ భాస్కర్ సినిమా ‘ఆరెంజ్’ లో నటించారు. ఆ సినిమా హిట కాకపోయినా చరణ్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ తరువాత రచ్చ, నాయక్, ఎవడు, తుఫాన్(జంజీర్ రీమేక్), గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ చిత్రాల్లో నటించి మెప్పించారు.
ఆ తరువాత వచ్చిన ధృవ చిత్రంలో రాంచరణ్ నటనకు ఫ్యాన్సే కాదు సినీ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో 1985 నాటి కాలాన్ని తలపిస్తూ తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రంతో బాక్సాఫీస్ హిట్ కొట్టాడు. ఇందులో చిట్టిబాబుగా ప్రేక్షకులను అలరించాడు.
ఇక ఆర్ఆర్ఆర్ తో సరికొత్త చరిత్ర సృష్టించాడు రామ్ చరణ్. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న చరణ్.. మరెన్నో సినిమాల్లో నటించి ఇలాగే మెప్పించాలని గ్రేట్ తెలంగాణ.కామ్ కొరుకుంటోంది.
Also Read:తెలుగులో మంజుమ్మెల్ బాయ్స్