మరిన్ని కష్టాల్లో ఫేస్‌బుక్‌..!

180
Tesla, Mozilla Are Among Businesses Taking a Facebook Pause
- Advertisement -

ఫేస్‌బుక్‌ కు కష్టాలు తప్పట్లేదు. ఇప్పటికే యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌ లీక్ చేసినట్టుగా వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్ సీఈవో మార్క్‌ జూకర్‌బర్గ్‌కు విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు వచ్చాయి. ఫైనల్‌గా జూకర్‌బర్గ్‌ కూడా పొరపాటు జరిగినట్టుగా ఒప్పుకున్నారు.

అయినా..ఫేస్‌బుక్‌కి కష్టాలు తప్పట్లేదు. లీక్‌ల వ్యవహారంతో అసంతృప్తిగా ఉన్న యూజర్లు ఇప్పటికే అకౌంట్ ను డిలీట్ చేసే పనిలో ఉన్నారు. ఆ క్రమంలోనే డిలీట్‌ ఫేస్‌బుక్‌ అంటూ హాష్‌టాగ్స్‌ తో సోషల్‌మీడియాలో ఉద్యమం ప్రారంభించారు.

Tesla, Mozilla Are Among Businesses Taking a Facebook Pause

అయితే తాజాగా..మొజిల్లా, టెస్లా,స్పేస్‌ఎక్స్‌ లాంటి ప్రముఖ కంపెనీలు కూడా ఫేస్ బుక్‌ నుంచి దూరమవుతున్నాయి. డేటా లీక్‌ చేసిందన్నఆరోపణలు ఫేస్‌బుక్‌పై రావడంతో స్పేస్‌ఎక్స్‌, టెస్లా ఖాతాలను తొలగించాలంటూ ట్విటర్‌లో ఎలన్‌మస్క్‌ను ఆయన ఫాలోవర్లు కోరడంతో ఖాతాలను తీసేస్తున్నట్లు ఎలన్‌ తెలిపారు.

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ మొజిల్లా ఫైర్‌ ఫాక్స్‌ కూడా అదే వరుసలో నడుస్తుంది. తాత్కాలికంగా ఫేస్‌బుక్‌ నుంచి బ్రేక్ తీసుకొంటున్నట్లు ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలోనే జూకర్‌బర్గ్‌ డేటా విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారు. కాగా..ఇప్పటికే వాట్సాప్‌ సహ వ్యవస్థాపకుడు బ్రెయిన్‌ ఆక్టన్ కూడా ఫేస్ బుక్ ను డిలీట్ చెయ్యాలంటూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -