- Advertisement -
తెలంగాణ ఏర్పాటు తర్వాత విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు ఐటీశాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నమన్న కేటీఆర్ విమాన ఇంధనంపై వ్యాట్‌ను 16శాతం నుంచి 1శాతం వరకు తగ్గిస్తున్నామని వెల్లడించారు.
శంశాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. కాగా…ఈ దశాబ్ది ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయిన సీఎం కేసీఆర్.. జ్యోతి ప్రజ్వలన చేసి దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు.
ఎయిర్ పోర్టు విస్తరణ పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్, కేటీఆర్ లతో పాటు మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, తీగల కృష్ణారెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
- Advertisement -