ప్రపోజల్‌కి పడిపోయిన తాప్సీ..!

231
Taapsee Pannu bowled over by love proposal
- Advertisement -

నవతరం కథానాయికల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ తాప్సీ. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లోనూ రాణిస్తున్నఈ భామ నిన్నటివరకూ గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. కానీ పింక్ మొదలుకొని అన్నీ వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకొంటూ నటిగా మంచి గుర్తింపు సాధించింది. తెలుగులో ఆనందోబ్రహ్మో చిత్రంలో హర్రర్ కామెడీతో తాప్సీ ప్రేక్షకుల మనసును దోచుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు మూవీలతో బిజీగా ఉన్న తాప్సీ ఓ యువకుడు రాసిన ప్రేమలేఖను చదివి ఫిదా అయిపోయిందట. మందు ముట్టనూ మాంసం ముట్టనూ… అన్నింటికంటే ముఖ్యంగా నేను వర్జీన్నీ… నీ మీద నాకున్న ప్రేమను నిరూపించేందుకు నార్కొటిక్ పరీక్షకైనా లై డిటెక్టర్ పరీక్షకైనా నేను సిద్ధమే. నా మెదడును పూర్తిగా పరీక్షించడం మాత్రం మరవద్దు…’ అంటూ ఓ అభిమాని చేసిన ఈమెయిల్ ప్రపోజల్‌ని షేర్ చేసింది తాప్సీ.

Image result for taapsee love proposal

బెస్ట్ ప్రపోజల్ ఎవర్‌…వెజిటేరియన్ లవ్ ఇంతకు మించి జీవితంలో ఇంకేం కావాలి అంటూ కామెంట్ చేసింది. తాప్సీ షేర్ చేసిన ఈ లవ్ ప్రపోజల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -