సీనియర్ నటుడు భాను చందర్ తనయుడు జయంత్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటిస్తోన్న చిత్రం ` మిక్చర్ పొట్లం`. గోదావరి సినీ టోన్ పతాకంపై సతీష్ కుమార్ ఎం.వి దర్శకత్వంలో కలపటపు లక్ష్మీ ప్రసాద్, కంటే వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్టు పూర్తిచేసుకు ని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
చిత్ర నిర్మాతలలో ఒకరైన లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ` మా బ్యానర్ లో తొలి సినిమా ఇది. పూర్తి కామెడీ జోనర్ లో తెరకెక్కిస్తున్పట్టికీ ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే సినిమా ద్వారా సమాజానికి చిన్న సందేశాన్ని కూడా అందజేస్తున్నాం. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. జబర్ దస్త్ టీం… అలీ, పోసాని, కృష్ణ భగవాన్ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. శ్వేతా బసు ప్రసాద్ వల్ల సినిమాకు మంచి హైప్ వస్తుంది. కొత్త నటీనటులన్నా అంతా సీనియర్ నటుల పెర్పామెన్స్ ను కనబర్చారు. దర్శకుడికి కొత్త సినిమా అయినా అనుభవజ్క్షుడిలా డైరెక్ట్ చేశారు. అందరి సహకారంతో మంచి అవుట్ ఫుట్ తీసుకొస్తున్నాం. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో లోనే ఆడియో, డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుందని` అన్నారు.
మరో నిర్మాత లంకల పల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ` సినిమా నిర్మాణంతో పాటు ఓ క్యారెక్ట్ కూడా పోషించాను. శ్వేతాబసు తో పాటు చాలా మంది సినియర్ నటులు నటించడంతో చిన్న సినిమా బాగా వచ్చింది. చిన్న సినిమాల్లో మా సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. ఇదే బ్యానర్ లో మరో రెండు సినిమాలు తెరకెక్కించనున్నాం` అన్నారు.
చిత్ర దర్శకుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ `నిర్మాతలు నా కథను ఫస్ట్ సిట్టింగ్ లోనే ఒకే చేశారు. సినిమాలంటే ఫ్యాషన్ ఉన్న నిర్మాతలు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. వాళ్లందరి కహకారంతో మంచి అవుట్ ఫుట్ ఇవ్వగలిగాను. సినిమా కథ.. అమలాపురం నుంచి షిరిడీ వెళ్లే బస్సు జర్నీ నేపథ్యంలో తెరకెక్కించాం. ఈ ప్రయాణంలో డిఫరెంట్ క్యారెక్టర్లు పరిచయమైతే ఎలా ఉంటుంది? జర్నీలో టైమ్ పాస్ కోసం రకరకాల టాపిక్స్ పై మాట్లాడుకుంటుంటా. మా కథలో కడా అలాంటి అంశాలే ఎలా హైలైట్ చేశామన్నది ఆసక్తికరం. ప్రస్తుత రాజకీయాలపై సెటైరికల్ కామెడీని ట్రై చేశాం. అలాగే హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు రక్తికట్టిస్తాయి. ఇందులో శ్వేత పాత్ర పేరు సువర్ణ సుందరి. చింతామణి, కనక మహా లక్ష్మీ పాత్రల్లా ఈ క్యారెక్టర్ కూడా తెలుగు ప్రేక్షకులకు కొన్నాళ్లపాటు గుర్తుండిపోతుంది. మంచి పాటలు కుదిరాయి. కళ్యాణ్ సమీ కెమెరా పనితనం హైలైట్ గా ఉంటుంది. మా సినిమాను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నా` అన్నారు.
హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ మాట్లాడుతూ ` కొత్త బంగారులోకం, రైడ్, కాస్కో సినిమాల తర్వాత మంచి సినిమా చేస్తున్నా. ఇందులో సువర్ణ సుందరి పాత్రలో ఓ సెలబ్రిటీ గా నటిస్తున్నా. రొమాంటిక్ సినిమా కాదిది. సమాజంలో మనుషులు ఎలా ఉంటారు? వాళ్ల వ్యక్తిత్వాలు..ఆలోచనా విధానం ఎలా ఉంటుందనే అంశాలను హైలైట్ గా కనిపిస్తాయి. సమాజాన్ని చైతన్య పరిచే విధంగా సందేశాత్మకంగా ఉంటుంది` అన్నారు.
ఇతర పాత్రల్లో గీతాజంలి, ఆలి, భానుచందర్, కృష్ణభగవాన్, సుమన్, పోసాని కృష్ణ మురళి, అమిత్ భార్గవ్, ఫిష్ వెంకట్, రేలంగి, చిట్టిబాబు, భద్రం, జబర్ దస్త్ మురళి, ఫణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు : చిరంజీవి.ఎస్, కెమెరా: కల్యాణ్ సమీ, ఎడిటింగ్ : ఎమ్. ఆర్. వర్మ, సంగీతం : మాదవపెద్ది సురేష్, కథ, కథనం, దర్శకత్వం : సతీష్ కుమార్ ఎం.వి.