తెలుగు తప్పనిసరి…

167
Telugu compulsory says KCR
- Advertisement -

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే విద్యాసంవత్సరం(2018-19) నుంచే అన్నిభాషల్లో తప్పనిసరిగా తెలుగు బోధించాలన్నారు.ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులు కూడా తెలుగు భాష నేర్చుకోవాలనే నిబంధన పెడుతున్నామని సీఎం స్పష్టం చేశారు.

తమిళనాడులో మాతృభాష బోధన విధానాన్ని అధ్యయనం చేసిన అధికారులతో సమావేశమైన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.మొదటి దశలో పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. తెలుగు సబ్జెక్ట్‌కు సిలబస్ రూపొందించాలని తెలుగు యూనివర్సిటీ, సాహిత్య అకాడమీలను సీఎం కేసీఆర్ కోరారు.

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తెస్తున్నట్లు వెల్లడించిన సీఎం…అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -