కన్ను కొడితే…వేటు పడినట్టే…!

244
The Wink Priya trouble
- Advertisement -

ప్రియా ప్రకాశ్ వారియర్…సోషల్ మీడియా పుణ్యమాని ఒక్క నైట్‌లోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రియా కన్ను కొట్టిన తీరు..కుర్రకారు గుండెల్ని పిండేసింది. ఇక ప్రియా పేరుతో ఎన్నో పేరడి,డబ్ స్మాష్‌లు వచ్చిన సంగతి తెలిసిందే. ఓవర్‌ నైట్‌లో వచ్చిన ఫేంతో పాటు వరుస ఆఫర్లతో ఈ అమ్మడు ఇప్పుడు బిజీగా మారిపోయింది.

ప్రియా వారియర్ లానే చూపులతో తూటాలు పేల్చేందుకు కోట్లాది మంది యువతులు ప్రియను అనుకరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కన్నుకొట్టే పిల్లలు ఎక్కువైపోతుండటంతో కొన్ని స్కూల్స్‌,కాలేజీల్లో యాజమాన్యాలకు తలనొప్పిగా మారింది.

తమిళనాడుకు చెందిన వీఎల్బీ జానకి అమ్మల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనే కాలేజీ విద్యార్ధులు ప్రియా వారియర్ కన్నుకొట్టిన సీన్‌కి బాగా ప్రభావితం అయ్యి.. ఎక్కడ చూసినా అదే పనిగా కన్నుమీటుతూ ఉండటాన్ని కాలేజ్ యాజమాన్యం గుర్తించింది. ప్రియాలా కన్నుకొడుతున్నారంటూ విద్యార్థుల నుంచి కంప్లైంట్స్ రావడంతో రంగంలోకి దిగిన యాజమాన్యం అలాంటి వారిపై ఏడాదిపాటు సస్పెన్షన్‌ వేటు వేసేందుకు సిద్దమైంది. ఇందుకోసం ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

The Wink Priya trouble

- Advertisement -