భారత క్రికెటర్లకు వార్షిక వేతనాలను బీసీసీఐ భారీగా పెంచింది. ప్రపంచంలోనే అత్యుత్తమ వేతనాలు భారత క్రికెటర్లకు ఉండాలని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఇటీవల సూచించింది. దీంతో జీతాలు భారీగా పెంచినట్లు బీసీసీఐ పేర్కొంది. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ కాలానికిగానూ కొత్త కాంట్రాక్టులను ప్రకటించింది. తాజాగా ప్రకటించిన ఈ వేతనాలు గతంలో క్రికెటర్లకు అందించిన వేతనాల కంటే ఇప్పుడు భారీగా పెరిగాయి.
బీసీసీఐ ప్రకటన ప్రకారం క్రికెటర్ల గ్రేడ్ల ప్రకారం ఏడాదికి అందనున్న వేతనాలు :
గ్రేడ్ ఏ క్రికెటర్లకు రూ.7 కోట్లు (విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా)
గ్రేడ్ ఏ క్రికెటర్లకు రూ.5 కోట్లు (రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మురళీ విజయ్, ఛటేశ్వర పుజారా, అజింక్యా రహానె, మహేంద్ర సింగ్ ధోనీ, వృద్ధిమాన్ సాహా)
గ్రేడ్ బీ క్రికెటర్లకు రూ.3 కోట్లు (కేఎల్ రాహుల్, ఉమేశ్ యాదవ్, కుల్ దీప్ యాదవ్, చాహెల్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, ఇషాంత్ శర్మ)
గ్రేడ్ సీ క్రికెటర్లకు రూ. కోటి (కేదార్ జాదవ్, మనీశ్ పాండే, అక్సర్ పటేల్, కరుణ్ నాయిర్, సురేశ్ రైనా పార్థివ్ పటేల్, జయంత్ యాదవ్)