3 పూటలా రోజూ ఒక లవంగం..

268
Surprising Benefits of Cloves
- Advertisement -

మన దేశంలోనే కాదు అనేక దేశాల్లోనూ లవంగాలను మసాలా దినుసుగా వాడుతారు. వీటిని వంటల్లో వేస్తే వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఇక లవంగాలు వేయకుండా నాన్ వెజ్ వంటలను వండరు. ఇవి అంతలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే కేవలం వంటలకే కాక ఇవి మనకు పలు ఆరోగ్యకర ప్రయోజనాలను ఇచ్చే అద్భుతమైన ఔషధంగా కూడా పనిచేస్తాయి. ఈ క్రమంలోనే రోజూ 3 పూటలా భోజనం తరువాత ఒక లవంగాన్ని నమిలి తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. లవంగాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. గ్యాస్, అసిడిటీ, వికారం, అజీర్ణం తగ్గిపోతాయి. మలబద్దకం పోతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

2. లవంగాల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక రకాల సూక్ష్మ క్రిముల నుంచి, ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఫ్లూ, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను నయం చేస్తాయి.

3. ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదటి దశలో ఉంటే అలాంటి వారు లవంగాలను రోజూ తింటే క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. లవంగాల్లో ఉండే యాంటీ కార్సినోజెనిక్ గుణాలు క్యాన్సర్ కణాలతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి.

4. లవంగాలను రోజూ తినడం వల్ల వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను శుద్ధి చేస్తాయి. మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

5. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నవారు నిత్యం తమ ఆహారంలో లవంగాలను చేర్చుకుంటే దాంతో అద్భుతమైన ఫలితం ఉంటుందని సాక్షాత్తూ వైద్యులే చెబుతున్నారు. లవంగాల్లో ఉండే ఇన్సులిన్ వంటి గుణాలు రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరిస్తాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

6. లవంగాల్లో యుజెనాల్, ఫ్లేవోన్స్, ఐసో ఫ్లేవోన్స్, ఫ్లేవనాయిడ్స్ అని పిలవబడే ఫీనోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఎముకలను రక్షిస్తాయి. దీంతో వయస్సు మీద పడడకం కారణంగా వచ్చే ఆస్టియో పోరోసిస్ (ఎముకలు గుల్లబారిపోవడం)ను తగ్గిస్తాయి.

7. లవంగాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. శరీరంలో నీరు ఎక్కువగా చేరకుండా చూస్తాయి.

8. లవంగాలను తినడం వల్ల దంతాలు, చిగుళ్ల సమస్యలు పోతాయి. దంతాలు దృఢంగా మారుతాయి. నోటి దుర్వాసన పోతుంది.

9. లవంగాలను తినడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. పాలలో చిటికెడు లవంగాల పొడిని కలుపుకుని తాగితే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది.

Also Read:‘రత్నం’.. ఖచ్చితంగా పైసా వసూల్

- Advertisement -