ముగిసిన శ్రీదేవి అంత్యక్రియలు ..

234
India crowds say goodbye to Bollywood star
- Advertisement -

శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు.

విల్లే పార్లేలోని సేవా సమాజ్‌ శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. అయితే కడసారి శ్రీదేవిని చూసేందుకు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై, ఏడు కిలోమీటర్లమేర కొనసాగిన శ్రీదేవి అంతిమయాత్రకు భారీగా తరలివరచ్చారు అభిమానులు. అంతేకాదు దశాబ్దాలపాటు వెండితెరను రాణిలా ఏలిన శ్రీదేవి ఇక లేదన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

శ్రీదేవి చివరిచూపుల సమయంలో కూతుళ్లు జాన్వీ, ఖుషీని ఓదార్చటం ఎవరితరం కాలేదు. తల్లిని ఇలా చూడాల్సి వస్తుందని ఊహించని ఆ పిల్లల వేదన అక్కడి వారిని కన్నీళ్లు పెట్టించింది.

షారూఖ్ ఖాన్, అనీల్ అంబానీ, ఇతర బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్, నిర్మాతలు, దర్శకులు, ఆప్తులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శ్రీదేవి భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో నివాళులర్పించారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి.. గౌరవ వందనం సమర్పించారు.

- Advertisement -