తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రసీమలను కొన్నేళ్లు ఏలిన అతిలోకసుందరి శ్రీదేవి. వెండితెరపై ఎన్నో సినిమాలు,ఎన్నో పాత్రలు చేసి మెప్పించింది. బోని కపూర్‌తో వివాహం తర్వాత సినిమా కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన శ్రీదేవి 2004లో తిరిగి సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించింది.
2004-05 మధ్యకాలంలో మాలినీ అయ్యర్‌గా బుల్లితెర మీద కొద్దికాలం ప్రత్యక్షమయ్యారు. శ్రీదేవి నటించడం వల్లే మాలినీ అయ్యర్ పాత్ర బాగా పాపులర్ అయింది. ఆ సీరియల్ అయిపోయాక రెండు మూడుసార్లు టీవీ షోలకు హాజరుకావడం తప్ప నటిగా మళ్లీ తెర మీదకు రాలేదు.
అయితే, నిర్మాతగా ‘పోకిరి’ చిత్రాన్ని హిందీలో సల్మాన్‌తో ‘వాంటెడ్’గా నిర్మించారు. 2012లో ‘ఇంగ్లీష్-వింగ్లీష్’ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ సినిమాలో శ్రీదేవి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇటీవలే ‘మామ్’ చిత్రంతో మరోసారి అలరించారు. ప్రస్తుతం ఆమె పెద్ద కుమార్తె జాన్వీని వెండితెరకు పరిచయం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. మరాఠాలో ఘన విజయం సాధించిన ‘సైరాట్’ సినిమాను హిందీలో ‘దడాక్’ పేరుతో రిమేక్ చేస్తున్నారు. కరణ్ జోహర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.