మహేష్ భార్యపై మలైకా కామెంట్స్..!

265
Malaika Arora Sensational Comments Against Namrata
- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పై బాలీవుడ్ నటి మలైకా అరోరా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాను మోడలింగ్ రంగంలోకి ప్రవేశించేనాటికే నమ్రత సీనియర్ మోడల్ అని చెప్పింది. ఆమెతో పాటు మరో మోడల్ మెహర్ జెస్సియా కూడా అగ్ర స్థానంలో ఉండేదని తెలిపింది. అయితే సీనియారిటీ కారణంగా వీరిద్దరూ తనతో చాలా పొగరుగా ప్రవర్తించేవారని వ్యాఖ్యానించింది.

Malaika Arora Sensational Comments Against Namrata

ప్రస్తుతం ఈ మెహర్ జెస్సియా.. అర్జున్ రాంపాల్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. నేహాధూపియా నిర్వహించే వోగ్-బీఎఫ్ ఎఫ్ కార్యక్రమంలో ఈ విషయాలను చెప్పింది మలైకా అరోరా. అయితే.. సడెన్ గా అలనాటి టాప్ మోడల్స్ గురించి నెగిటీవవ్ విషయాలు రివీల్ చేసే సరికి సిట్యుయేషన్ సీరియస్ అయిపోయింది. కానీ తన కెరీర్ ప్రారంభంలో వీరి వల్ల అనేక ఇబ్బందులు ఎదురైనా.. ప్రస్తుతం వీరిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ.. పరిస్థితిని తేలికపరిచే ప్రయత్నం చేసింది మలైకా అరోరా.

- Advertisement -