బిగ్ హౌస్‌లోకి సరైనోడు..!

184
Jr. NTR out and Allu Arjun in for Bigg Boss
- Advertisement -

బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’.. తెలుగులోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తొలి సీజన్‌కే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో మంచి ఆదరణ లభించింది. తెలుగులో బుల్లితెరపై ఇప్పటి వరకు ఏ రియాలిటీ షో సంపాదించలేనన్ని రేటింగ్స్‌ను ‘బిగ్ బాస్’ సీజన్-1 రాబట్టింది. ఎన్టీఆర్ హోస్టింగ్ సూపర్ హిట్ కావడంతో సెకండ్‌ సీజన్‌కి కూడా ఎన్టీఆర్‌ చేస్తే బాగుంటుందని చాలామంది భావించారు.

కానీ రెండో సీజన్‌ ఎన్టీఆర్‌ చేయడంలేదట. ‘టైమ్‌ కుదరకపోవచ్చు’ అని నిర్వాహకులకు ఎన్టీఆర్‌ తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. దాంతో నెక్ట్స్‌ బిగ్‌ బాస్‌ను వెతికే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇంకో వార్త ఫిల్మ్ నగర్‌లో హల్ చల్ చేస్తోంది. ‘బిగ్ బాస్’ సీజన్-2కు అల్లు అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు కొంత మంది స్టార్ల పేర్లు పరిశీలించారని, వారిలో అల్లు అర్జున్‌తోపాటు నేచురల్ స్టార్ నాని కూడా ఉన్నారని అంటున్నారు.

Jr. NTR out and Allu Arjun in for 'Bigg Boss

అయితే మా ఛానెల్ మాత్రం అల్లు అర్జున్ వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తోందట. దీనిపై ఇంకా ఫైనల్ అనౌన్స్ మెంట్ చేయలేదు యాజమాన్యం.. జూలై నుంచి సీజన్ సెకండ్ స్టార్ట్ అవుతుంది. అల్లు అర్జున్ ఒప్పుకుంటే.. షూటింగ్ ఎక్కడ అనేది తేలాల్సి ఉంది. అల్లును ఒప్పిస్తే సీజన్ సెకండ్ కు మంచి హైప్ వచ్చినట్లే. కొంచెం కామెడీ.. మరికొంచెం సెటైరింగ్ లో అల్లు అర్జున్ ముందుంటాడు. ఇక అందరిలో కలిసిపోయే హీరో కూడానూ. ఎన్టీఆర్ ప్లేస్ ను పరెఫెక్ట్ గా భర్తీ చేయగల హీరో అల్లు అర్జున్ అంటోంది సినీ ఇండస్ట్రీ. ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ కారణంగా హైదరాబాద్ నుంచి ముంబైకి లొకేషన్ షిఫ్ట్ అయ్యింది. మరి అల్లు అర్జున్ ఏ సిటీలో కావాలంటాడో చూడాలి.

- Advertisement -