- Advertisement -
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రోజా పవన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ధర్నాలు, నిరసనలకు దిగుతానని హెచ్చరించిన పవన్ కల్యాణ్, ఇప్పుడు ఎందుకోసం వెనక్కు తగ్గారని ప్రశ్నించారు.
ఈ ఉదయం తిరుమలకు వచ్చిన రోజా మీడియాతూ.. ప్రశ్నిస్తానంటూ గొప్పలు చెప్పుకున్న పవన్, నాలుగేళ్ల పాటు మౌనంగా ఉండి, ఇప్పుడు జేఎఫ్సీ అంటూ ప్రజల ముందుకు వస్తే నమ్మబోరని అన్నారు.
రాజకీయ పక్షాలు పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి పోరాడితేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. పవన్ సూచించిన విధంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి జగన్ మద్దతిస్తారని, అందుకు అవసరమైన ఎంపీల మద్దతు కోసం పవన్ సహకరించాలని డిమాండ్ చేశారు.
- Advertisement -