రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు అరుణ్ జైట్లీ.లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన జైట్లీ రాజకీయాలకు అతీతంగా సంస్కరణలు చేపట్టామని చెప్పారు. దేశంలో 86 శాతం మంది సన్న,చిన్నకారు రైతులే ఉన్నారని తెలిపారు. స్టెంట్ల ధరలు తగ్గించామని వెల్లడించారు.
గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. మోడీ నాయకత్వంలో వ్యవస్థీకృత సంస్కరణలు అమలవుతున్నాయని చెప్పారు. ఆహార ధాన్యాల మద్దతు ధర ఒక శాతం పెంచామని చెప్పారు. రైతుల ఆదాయం పెంపుపై ప్రధాన దృష్టి సారించామని చెప్పుకొచ్చారు.
మద్దతు ధరలు నిర్ణయించడానికి వ్యవస్థీకృత యంత్రాంగం ఏర్పాటుచేస్తామని చెప్పారు. పేదలపై వైద్యం భారం పడకుండా చూశామన్నారు. వ్యవసాయ మార్కెట్ ఫండ్ రూ. 200 కోట్లని చెప్పారు.కొంతకాలంగా చేస్తున్న సంస్కరణలు ఇప్పుడు ఫలితాలను అందిస్తున్నాయని చెప్పారు.
సౌభాగ్య పథకంలో లక్ష కుటుంబాల్లో వెలుగులు నింపామన్నారు.వ్యవసాయ వృద్ధికి క్లస్టర్ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం ఎగుమతులు 15 శాతం పెరిగాయని చెప్పారు. జాలర్లకు క్రెడిట్ కార్డులు…వెదురు పరిశ్రమకు రాయితీలు అందిస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ కోసం రూ. 1440 కోట్లు కేటాయించామన్నారు. ఆర్గానిక్ వ్యవసాయంతో మహిళలకు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. సౌరశక్తి ఉత్పత్తి పెరిగేలా చేయూత నందిస్తామన్నారు.