జీఎస్టీతో పేదలకు మేలు..

190
Union Budget 2018 updates
- Advertisement -

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటిని నేరవేర్చామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అరుణ్ జైట్లీ..ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. గతం కంటే ఆర్ధిక వృద్ధిలో వేగం పుంజుకుందన్నారు. డిజిటల్ టెక్నాలజీతో పేదలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యాయని తెలిపారు. నోట్లరద్దుతో డిజిటల్ కరెన్సీ పెరిగిందన్నారు.

జీఎస్టీ వల్ల పేదలకు మేలు జరిగిందన్నారు. విదేశీ మారక నిల్వలు పెరిగాయన్నారు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశాల్లో ఏడో స్ధానంలో ఉందని త్వరలోనే ఐదో స్ధానానికి చేరుకుంటామన్నారు. సరికొత్త ఇండియాను ఆవిష్కరిస్తున్నామని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రపంచంలోని దేశాల్లో భారత్ 47వ స్దానంలో నిలిచిందన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయం,గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. జీఎస్టీతో పన్నుల విధానం సులభతరంగా మారిందన్నారు.పేదవారికి ఉచితంగా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేశామని తెలిపారు.రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.ప్రభుత్వ పథకాల్లో అవినీతిని అరికట్టామని చెప్పారు.ఆన్ లైన్లో ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని చెప్పారు.

- Advertisement -