ఏపీలో ‘ముందస్తు’ హీట్

164
2018 Elections in Andhra Pradesh
- Advertisement -

ముందస్తు ఎన్నికల టాపిక్ జోరందుకోవడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. దేశంలోని మిగతా పార్టీలన్నింటి కన్నా… తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ముందే ఎన్నికల మంత్రాన్ని జపిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఎన్నికలు వచ్చేస్తున్నాయ్.. వచ్చేస్తున్నాయ్.. అంటూ పొలిటికల్ హిట్‌ని పెంచేశాయి. ముఖ్యంగా ప్రధాన పోరు టీడీపీ,వైసీపీ మధ్య జరిగే అవకాశం ఉండటంతో అధికారం దక్కించుకునేందుకు ఇరు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహలను సిద్దంచేస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పార్టీని పటిష్టపరచడం, వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిసారించారు. అభ్యర్థుల అన్వేషణ , కొన్ని చోట్ల సిట్టింగ్ లను మార్చే ఆలోచన చేస్తున్నారు. దీంతో పాటు ప్రతిపక్ష పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించారు. గెలుపు గుర్రాల కోసం సీక్రెట్‌ సర్వేలు చేయిస్తున్న చంద్రబాబు రెండోసారి ప్రజలు తమకే అధికారం కట్టబెట్టడతారన్న ధీమాతో ఉన్నారు.

అయితే, చంద్రబాబును ఢీ కొట్టేందుకు వైసీపీ అధినేత జగన్‌ పక్కావ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న జగన్‌..ఏపీకి ప్రత్యేక హోదా,ఉద్యోగాల వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇక అవసరమైతే బీజేపీతో పోత్తుకు సైతం సై అంటున్నారు జగన్‌. ఇప్పటివరకు టీడీపీతో బీజేపీ పొత్తు ఉండగా ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య పోరు ఉప్పు-నిప్పులా తయారైంది. అటు అసెంబ్లీలో గానీ, ఇటు బయట గానీ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే మాట్లాడే బీజేఎల్పీ నాయకుడు విష్ణుకుమార్‌రాజు కూడా ఇప్పుడు ఉన్న ట్టుండి వైసీపీ పల్లవి అందుకోవడంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపుగా ఖరారైనట్లేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

అయితే వైసీపీ-బీజేపీ పొత్తును టీడీపీ నాయకులు కూరలో కర్వేపాకులా తీసి పారేస్తున్నారు. బీజేపీతో పొత్తు కంటే ఒంటరిగానే బరిలోకి దిగేందుకు ఆ పార్టీ నేతలు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేగాదు రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతగానో ప్రయత్నించిన బీజేపీ సహకరించలేదన్న భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈజీ అంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు.

దీనికి తోడు పవన్ కల్యాణ్ జనసేనతో టీడీపీకి లాభం చేకూరే అవకాశం ఉంది. ఇప్పటివరకు టీడీపీకి మద్దతిస్తు వచ్చిన పవన్…బలమున్న చోట్లలోనే పోటీ చేస్తాననడం…అనంతపురం పర్యటనలో భాగంగా టీడీపీ నేతలు పరిటాల సునీత, ప్రభాకర్ చౌదరిలను కలవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ఏపీలో టీడీపీకి పవన్ మద్దతిస్తారన్న టాక్‌ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఇక జాతీయ పార్టీ కాంగ్రెస్ ఏపీలో ప్రభావం చూపే అవకాశం తక్కువగా ఉంది. ఒకప్పుడు దక్షిణాదిలో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఏపీలో ఆపార్టీ నిలవునీడ కొల్పోయిన అలో ల‌క్ష్మ‌ణా అంటోంది. కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టులు కేడ‌ర్ ప‌రంగా బాగానే ఉన్నా సీట్లు గెలిచే అవకాశాల తక్కువ. మొత్తంగా రెండోసారి అధికారంలోకి రావడం కోసం టీడీపీ పెద్దగా కష్టపడాల్సిన పనిలేకపోయిన వైసీపీ అధినేత జగన్ మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

- Advertisement -