ఫోన్ కాల్స్ తో వేధిస్తున్నారు…

275
anasuya
- Advertisement -

తన అందంతో యువతను బుల్లి తెరకు కట్టిపడేసే అనసూయ..టీవీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో బోలెడన్ని విషయాలు పంచుకుంటోంది. మధ్య మధ్యలో చాట్ చేస్తూ నాటీ ఆన్సర్లతో స్వీట్ రిప్లైలు ఇస్తుంది. తాజాగా  తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పిన యాంకర్ అనసూయ.. తనను కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

anasuya

గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. తన పట్ల కొందరు వ్యవహరిస్తోన్న తీరును జబర్దస్ యాంకర్ తీవ్రంగా నిరసించింది. నాకు నచ్చిన పని చేసుకునే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించింది. సంప్రదాయం, సంస్కృతి పేరిట కొందరు గుండాలు నా గౌరవానికి భంగం కలిగిస్తున్నారంటూ వాపోయింది. అనసూయ తన ట్విట్టర్ లో డియర్ ఇండియా.. ఓ కూతురిగా, సోదరిగా, మహిళగా, భార్యగా, కోడలిగా, అమ్మగా.. మిగతా అందరిలా నా బాధ్యతలని నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. నేను చేసే పనులు, నేను ధరించే దుస్తులపై నా ఫ్యామిలీ ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదు.

anasuya

కాని ఇది ఇతరులపై ప్రభావం చూపుతున్నట్టుగా ఉంది. మాట్లాడే స్వేచ్చగా ఉంది కదా అని కొందరు నన్ను కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. నా పట్లే కాదు. నా భర్త, పిల్లలు, తల్లి దండ్రులు ఇలా ఫ్యామిలీ అందరిని దూషిస్తున్నారు. నిత్యం ఫోన్స్, కామెంట్స్ ద్వారా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నాను. ఇది తెలుసుకునే శక్తి కూడా మీకు లేదు. బాధ్యత కలిగిన మహిళగా రిపబ్లిక్ డే సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇదే నా స్వేచ్చ అంటే. నచ్చిన పని చేసుకునే స్వేచ్చ లేదా, నా గౌరవాన్ని కాలితో నలిపిస్తారా ? ఇక ఇలాగే జీవించాలా, దీని గురించి ఏం చేయలేమా అని అనసూయ బాదాతప్త హృదయంతో ట్విట్టర్ సాక్షిగా ప్రశ్నించింది.

- Advertisement -