పద్మావత్‌..ఓ అద్భుతం

240
Bhansali Delivers A 'Masterpiece'
- Advertisement -

సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం పద్మావత్. విడుదలకు ముందే వివాదాస్పదంగా మారిన ఈ చిత్రం రేపు విడుదలకు సిద్దంకాగా ప్రివ్యూ చూసిన పలువురు సినిమాపై పొగడ్తల ప్రశంసల వర్షం కురిపించారు. పద్మావత్ ఓ అద్భుతమని…దీపిక నటనకు ఫిదా అయ్యామని అభిప్రాయమని వ్యక్తం చేస్తున్నారు.

దీపిక కళ్లతోనే అద్భుతం చేసిందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.సినిమాలో రాజ్ పుత్ వర్గం మహిళలను కించపరిచేలా ఎలాంటి సన్నివేశాలూ లేవని భరోసాను ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ చూసేలా చిత్రం ఉందని, ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందని కితాబిస్తున్నారు. భన్సాలీ ఓ మాస్టర్‌ పీస్‌ని ప్రేక్షకులకు అందించాడని పలువురు నెటిజన్లు ట్వీట్‌ చేస్తున్నారు. ఎన్ని వివాదాలు వచ్చినా సినిమా సక్సెస్ సాధించడం ఖాయమని బాలీవుడ్ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

మరోవైపు ‘పద్మావత్’ చిత్రానికి రాజ్ పుత్ కర్ణిసేన నుంచి నిరసనల సెగ ఉవ్వెత్తున ఎగసింది. ఈ సినిమాను ప్రదర్శించేందుకు సిద్ధమైన గుజరాత్ థియేటర్లపై కర్ణిసేన సత్తా చూపింది. అహ్మదాబాద్ వన్ మాల్స్, హిమాలయ తదితర థియేటర్ల వద్ద కర్ణిసేన కార్యకర్తలు అన్నంతపనీ చేశారు. ఇష్టానుసారం విధ్వంసం సృష్టిస్తూ, రోడ్లపై ఉన్న దాదాపు 150 వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులు రంగంలోకి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుంటాయని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

- Advertisement -