2019లో ఒంటరిపోరే…

191
No truck with BJP says Sena
- Advertisement -

భారతీయ జనతా పార్టీకి శివసేన గట్టిషాకిచ్చింది. 2019లో జరిగే పార్లమెంట్, మహారాష్ట్ర ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆ పార్టీ నిర్ణయించింది. ఇవాళ జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయానికి పార్టీనేతలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో మహారాష్ట్రలో అన్ని స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు పార్టీ ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు గాను 25 స్థానాల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 150 స్థానాల్లో జయకేతనం ఎగరవేయాలని పార్టీ శ్రేణులకు శివసేన దిశానిర్దేశం చేసింది.

దీంతో 28 సంవత్సరాల శివసేన-బీజేపీ బంధానికి మరోసారి బీటలు ఏర్పడ్డాయి. 2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, శివసేనను కాదని ఒంటరిగా పోటీ చేసింది. ఎన్నికల ఫలితాల తరువాత మళ్లీ శివసేనతో చేతులు కలిపి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి.

- Advertisement -