రకుల్ చూపు బాలీవుడ్ వైపు..?

194
rakul-preet-
- Advertisement -

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతుంది. ‘యారియాన్’ అనే చిత్రంతో రకుల్ బాలీవుడ్ కు పరిచయమయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘అయ్యారీ’ అనే మరో సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తుంది. ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు మరో హిందీ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది రకుల్. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తోన్న సినిమాలో రకుల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.

rakul-preet-

ఈ సినిమాలో రకుల్ పూర్తి గ్లామర్ రోల్ లో కనిపించనుందని సమాచారం. అయితే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం తెలుగు సినిమాల కన్నా బాలీవుడ్‌ సినిమాలపైనే ఎక్కువగా గురిపెట్టినట్టు తెలుస్తోంది. తెలుగులో ప్రస్తుతం అమ్మడు ఇంకా ఏ సినిమా సైన్ చేయలేదు. ఉండడానికి మూడు నాలుగు అవకాశాలు ఉన్నాకూడా.. అమ్మడు ఏది సైన్ చేయలేదు. టాలీవుడ్లో అందరూ గ్లామర్ పాత్రలే ఇస్తున్నారని కావచ్చేమో.. ఈ ముద్దుగుమ్మ హిందీవైపు చూస్తోంది. రకుల్‌ బాలీవుడ్‌ లో మరికొన్ని ప్రాజక్టులకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. దీంతో ఇక బాలీవుడ్ పైనే దృష్టి పెట్టాలని చిన్నది నిర్ణయించుకుందని అంటున్నారు.

- Advertisement -