సినీ క్రిటిక్ కత్తి మహేష్-పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం కత్తి మహేష్ పవన్ ఫ్యాన్స్ కోడిగుడ్లతో దాడిచేయగా దీనిపై ఆయన పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టారు. దీనిపై జనసేన అధికారికంగా క్లారిటీ కూడా ఇచ్చింది.
ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సుదీర్ఘంగా నిర్వహించిన చర్చలో పవన్ ఫ్యాన్స్-కత్తి మహేష్ మధ్య రాజీ కుదిరింది. వివాదాన్ని ఇంతటితో ఆపేయాలంటూ సినీ నిర్మాత రాంకీ మహేశ్ కత్తిని కోరారు. పవన్ లేఖ విడుదల చేశారు కాబట్టి ఇక పోరాటం ఆపేయాలని సూచించారు. అయితే, దాడి జరిగాక పవన్ లేఖను విడుదల చేశారు కాబట్టి ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినా తర్వాత పవన్ అభిమాన సంఘాల నేతలు ఇచ్చిన వివరణతో కత్తి సంతృప్తి చెందారు. దీంతో పవన్ అభిమానులపై పెట్టిన కేసును వెనక్కితీసుకున్నాడు కత్తి మహేష్.
తనపై గుడ్లదాడికి పాల్పడిన వారిపై పెట్టిన కేసును ఉపసంహరించుకున్న మహేశ్ కత్తికి సినీ రచయిత కోన వెంకట్ ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో మహేశ్ కత్తి ఫొటో పోస్ట్ చేసి థ్యాంక్స్ చెప్పాడు. ‘‘వివాదానికి ఇంతటితో ముగింపు పలికేందుకు ముందుకొచ్చిన నీకు ధన్యవాదాలు. నీ కెరీర్ బాగుండాలి. ఇకపై నిన్ను ఎవరూ దూషించరు, నీ జోలికి ఎవరూ రారు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే వారు పవన్‌కు శత్రువులు అవుతారు. నన్ను నమ్ము’’ అని ట్వీట్ చేశాడు.