వక్కంతం వంశీ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘నా పేరు సూర్య’ . అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల వదిలిన ఈ సినిమా ఫస్టు ఇంపాక్ట్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ మూవీ శాటిలైట్స్ విషయంలోనూ అల్లు వారబ్బాయి తన సత్తాచాటాడు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఏకంగా 15 కోట్ల రూపాయలు పలికినట్లు సమాచారం. జీ తెలుగు ఇంతమొత్తాన్ని వెచ్చించి అర్జున్ మూవీ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుందట.
గతంలో అల్లు అర్జున్ చేసిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా శాటిలైట్ హక్కులను కూడా జీ తెలుగువారే 13 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ‘నా పేరు సూర్య’కు అంతకన్నా ఎక్కువ రేటు పెట్టడం విశేషం. దీంతో పాటు అల్లు అర్జున్ ఇటీవలి సినిమాలు థియేటర్ల వద్ద కన్నా వెబ్ మీడియాలో, టీవీలో బాగా హిట్ అయ్యాయి.
సరైనోడు, డీజేలకు బెస్ట్ టీఆర్పీలు వచ్చాయి. సరైనోడు డబ్బింగ్ వెర్షన్లను యూట్యూబ్ లో పెడితే వాటికి రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం జీ తెలుగు ఇంతమొత్తాన్ని వెచ్చించిందని టాక్.