తొలిప్రేమ ఆడియో ఎప్పుడో తెలుసా..!

345
Tholi Prema Audio on Nov 20

ఫిదా హిట్‌తో జోష్ మీదున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తొలి ప్రేమ సినిమా చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ” హృదయానికి హత్తుకునే ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కిందని అన్నారు. “పాత్రలను మలచినతీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. వరుణ్ తేజ్ తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా, న్యూ లుక్ తో ఈ సినిమాలో కనిపించనున్నాడు. తమన్ అందించిన సంగీతం యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ నెల 20వ తేదీన పాటలను రిలీజ్ చేయనున్నాం. ఆడియో రిలీజ్ తరువాత ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయం” అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచిరెస్పాన్స్ వచ్చింది. మ‌న జీవితంలోకి ఎంత మంది అమ్మాయిలు వ‌చ్చిన ఫ‌స్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎన్న‌టికి మ‌ర‌చిపోలేం అనే డైలాగ్ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది.

Tholi Prema Official Teaser | Varun Tej | Raashi Khanna | Thaman S | Venky Atluri | #TholiPrema