బ్యాక్ టూ బ్యాక్ రెండు చిత్రాలతో ప్రేక్షకులను ఈ ఏడాది పలకరించబోతున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. అందులో ఒకటి ‘ఎమ్మెల్యే’, మరొకటి ‘నా.. నువ్వే’ . ఇక సంక్రాంతి కానుకగా ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) చిత్ర టీజర్‌ను ఈ రోజు విడుదల చేశారు.
వచ్చేస్తున్నాడు.. వచ్చేశాడు.. మనందరి ఆశాజ్యోతి… ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ..’ అన్న డైలాగ్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎమ్మెల్యే గెటప్‌లో స్టైల్‌గా కళ్లద్దాలు పెట్టుకోవడం, కండువా వేసుకోవడం ఆకట్టుకుంటోంది. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ‘ఎమ్మెల్యే’ రూపుదిద్దుకున్నట్లు అనిపిస్తోంది.
ఇందులో కల్యాణ్‌రామ్‌కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ‘లక్ష్మీ కల్యాణం’ తరువాత కల్యాణ్‌రామ్, కాజల్ జంటగా నటిస్తున్న రెండో చిత్రం ఇది. ఉపేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=qIXwsrwHVB4