ఈ ఫుడ్స్‌తో ఈజీగా బరువు తగ్గండి!

323
- Advertisement -

సహజంగా చాలా వరకూ ఇండియన్ ఫుడ్స్ లో బరువు తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని ఆరోగ్యకరమైన ఇండియన్ ఫుడ్స్ బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. అంతే కాదు అవి తినడం వల్ల బరువు తగ్గించడంతో పాటు మన శరీరానికి కావల్సి న్యూట్రిషయిన్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా అంధిస్తాయి. కాబట్టి ఇండియన్ ఫుడ్స్ లో బరువు తగ్గించే వాటిని సెలక్ట్ చేసుకొని మరీ ఉపయోగించడం వల్ల బరువు తగ్గించే ప్రయోజనాలు కూడా మెండుగా కనబడుతాయి.

అయితే ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరు, స్థూలకాయంతో బాధపడుతున్న వారు నిత్యం తాము తినే ఆహారాన్ని త‌గ్గించే య‌త్నం చేస్తుంటారు. ఆహారం ఎక్కువగా తింటే బరువు పెరుగుతామేమోనని తిండి తగ్గిస్తారు. అది నిజ‌మే అయిన‌ప్ప‌టికీ అన్ని ప‌దార్థాలు మ‌న శ‌రీర బ‌రువును పెంచ‌లేవు. కొన్ని త‌గ్గిస్తాయి. ముఖ్యంగా కింద ఇచ్చిన ప‌లు డ్రింక్స్ శ‌రీర బ‌రువును ఎఫెక్టివ్‌గా త‌గ్గిస్తాయి. రెగ్యుల‌ర్‌గా వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి ఇట్టే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ డ్రింక్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందామా..!

Fast Weight Loss Tips

1. కూరగాయల రసాలు

అధిక బరువును తగ్గించండంలో వెజిటబుల్ జ్యూస్‌లు కీలకపాత్ర పోషిస్తాయి. తాజా, పచ్చి కూరగాయలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్‌లను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతోపాటు శరీరానికి కావల్సిన ఫైబర్, ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. అంతేకాదు ఎక్కువ సేపు ఉన్నా ఆకలి కాకుండా చూస్తాయి. దీంతో బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది.

2. ద్రాక్ష రసం

ద్రాక్ష పళ్ల రసంలో విటమిన్ సితోపాటు శరీర మెటబాలిజంను వేగవంతం చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలను ఇది బయటికి పంపివేస్తుంది. లివర్ పనితనాన్ని మెరుగు పరుస్తుంది. బరువు తగ్గించడంలోనూ గ్రేప్ జ్యూస్ చక్కగా పనిచేస్తుంది. రోజూ కొంత మోతాదులో దీన్ని డైరెక్ట్‌గా లేదా నీటితో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఉదయాన్నే అల్పాహారం తీసుకునే సమయంలో ఈ రసం తాగితే బరువు తగ్గించేందుకు బాగా పనిచేస్తుంది.

3. గ్రీన్ టీ

అధిక బరువు తగ్గేందుకు గ్రీన్ టీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మెటబాలిజంను పెంచే ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. గ్రీన్ టీని వేడిగా లేదా చల్లగా ఎలా కావాలంటే అలా తాగవచ్చు, కానీ ఇందులో చక్కెర కలపకుండా తీసుకుంటేనే బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ఉదయం వేళలో దీన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

4. నీరు

నీరు కూడా బరువును నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. నిత్యం 8 నుంచి 12 గ్లాసుల నీటిని తాగితే శరీరంలోని విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. దీనికి తోడు దేహం ఎల్లప్పుడూ డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది. చల్లని నీటిలో తేనెను కలుపుకుని తాగితే క్యాలరీలను ఎక్కువగా ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నీటిని కొద్దిగా వేడి చేసి గోరు వెచ్చగా తాగినా శరీరంలోని కొవ్వు కరుగుతుంది.

lose-weight-during-the-week--follow-this-diet---_1513320137229_namaste_in

5. కొబ్బరి నీళ్లు

ప్రకృతిలో మనకు లభ్యమవుతున్న సహజసిద్ధమైన డ్రింక్స్‌లో కొబ్బరి నీళ్లు ప్రధానమైనవి. ఇవి శరీర మెటబాలిజం రేటును వృద్ధి చేస్తాయి. రోజుకు 1 నుంచి 2 గ్లాసుల వరకు కొబ్బరి నీళ్లను తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభించడంతోపాటు బరువు కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు శరీరంలోని విష పదార్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి.

6. బ్లాక్ కాఫీ

బరువు తగ్గించుకునేందుకు బ్లాక్ కాఫీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది కూడా శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చూస్తుంది. రోజుకు 2 కప్పుల బ్లాక్ కాఫీని చక్కెర లేకుండా తాగితే కొద్ది వారాల్లోనే అధిక బరువంతా శరీరం నుంచి మాయమవుతుంది.

Also Read:వీఆర్ఏల క్రమబద్దీకరణ..మార్గదర్శకాలు

7. క్రాన్‌బెర్రీ జ్యూస్

తాజా క్రాన్‌బెర్రీ పండ్ల జ్యూస్ బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ జ్యూస్‌లోని పలు ఔషధ గుణాలు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. విషపదార్థాలను బయటికి పారదోలుతాయి. ఇవే కాకుండా శరీరానికి కావల్సిన పోషకాలన్నీ దీంతో అందుతాయి.

పైన పేర్కొన్న ఏ జ్యూస్ లేదా ద్రవాన్నైనా చక్కెర లేకుండా తాగితేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. బరువు తగ్గాలనుకుంటే ఇది పాటించడం తప్పనిసరి.

Also Read:IND VS WI 3rd ODI:సిరీస్ భారత్‌దే

- Advertisement -