కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్. రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాల కోరని..గాంధీభవన్ అబద్దాల భవన్‌గా మారిందని ఆరోపించారు. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన సుమన్.. తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నారని…సీఎం నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని..కరెంట్ కోసం ధర్నాలు జరుగుతలేవని తెలిపారు.
కరెంట్‌పై రేవంత్ చెప్పినవన్ని ఖాకీలెక్కలేనని దుయ్యబట్టారు. రేవంత్ చెప్పిన ప్రతిదానికి వివరణ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. కొంతమంది సన్నాసులు, మూర్ఖులు విద్యుత్‌పై అడ్డగొలుగా మాట్లాడుతున్నారని రేవంత్‌ను తూర్పారబట్టారు సుమన్.
కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం ధర్నాలు జరిగేవని గుర్తుచేశారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం చూసి కాంగ్రెస్ నాయకులు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ కంపెనీలకు మేలు చేస్తున్నామన్న రేవంత్ తన వ్యాఖ్యలను నిరూపించాలని డిమాండ్ చేశారు.
సోలార్ పవర్‌లో తెలంగాణ భారతదేశంలోనే నెంబర్ 1గా నిలిచిందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇకనైనా దుష్ప్రచారం మానాలని సూచించారు. భారతదశ చరిత్రలో ఒక థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించి 38 నెలల కాలంలో పూర్తి చేసిన చరిత్ర లేదని ఆ రికార్డును తెలంగాణ నెలకొల్పిందన్నారు.15 వేల మెగావాట్ల విద్యుత్‌ను సాధిస్తే సీఎం కేసీఆర్‌కు సన్మానం చేస్తానన్న రేవంత్… ఆమాట మీద నిలబడాలన్నారు.