తెలుగు సినీ పరిశ్రమలో తమదైన హాస్యంతో మెప్పించిన కమెడియన్ గుండు హనుమంతరావు. ఎక్కడా అసభ్యతకు తావులేని కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన గుండు తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు నిజజీవితంలో మాత్రం ఆయన్ని విషాదం ఎక్కిరించింది.
ఇటీవల ఓ షోలో మాట్లాడిన ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన వంతు సహాయంగా గుండు హనుమంతరావులకు చెరో రూ.2లక్షలు ఆర్థిక సహాయం అందించారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం గుండు హన్మంతరావుకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్… గుండు హన్మంతరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కాగా గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉందని వైద్యులు సూచించారు. అయితే చికిత్సకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
Rs. 5 lakhs for treatment of popular cube artist Gundu Hanmanth Rao released from CM relief fund. pic.twitter.com/n7aGw2zfjO
— KTR (@KTRTRS) January 8, 2018