‌డాక్టర్‌గా నాని.. డాన్‌గా నాగ్..?

190
Nani-Nag multi-starrer to begin from February
- Advertisement -

నాగ్‌, నాని కథానాయకులుగా ఓ మల్టీస్టారర్‌ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రమాలు కూడా జ‌రుగుతున్నాయ‌ని సమాచారం. ఈ సినిమా వ‌చ్చే నెల‌లో సెట్స్ పైకి వెళుతుంద‌ని తెలుస్తుండగా సి.అశ్వినీద‌త్ నిర్మాణంలో భలే మంచి రోజు , శమంతకమణి సినిమాల ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య నాగ్‌-నానిల మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్ట్‌ని తెర‌కెక్కించ‌నున్నాడు.

Nani-Nag multi-starrer to begin from February

ఈ మూవీలో నాగార్జున డాన్‌గా క‌నిపిస్తాడ‌ని, నాని డాక్ట‌ర్ పాత్ర పోషిస్తున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిద్ద‌రి మ‌ధ్య లింక్ ఏంటీ, ఇద్ద‌రు క‌లిసి ఎలాంటి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌నున్నార‌నేది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది. నాని న‌టించిన ఎంసీఏ ఇటీవ‌ల ప్రేక్ష‌క‌లు ముందుకు రాగా, ఏప్రిల్ లో కృష్ణార్జున యుద్ధం చిత్రంతో ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఇక నాగ్ ప్ర‌స్తుతం వ‌ర్మ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం త‌ర్వాత నాగ్ సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి సీక్వెల్ చేయ‌నున్నాడు.

- Advertisement -