అనుష్క ప్రధాన పాత్రలో అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగమతి’. ఉన్ని ముకుందన్, ఆది పినిశెట్టి, ఆశా శరత్ ముఖ్యపాత్రలు పోషించగా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. జనవరి 26న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘బాహుబలి-2’ తర్వాత అనుష్క నటించిన చిత్రమిదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన అనుష్క తాజాగా ట్రైలర్‌తో అదరగొట్టింది. ఏదో కేసులో భాగంగా జైలుకు తరలించినట్లు చూపించారు. ఆ తర్వాత ఆమెను ఓ పాడుబడ్డ బంగ్లాలో వదిలేస్తారు.
‘ఎవడు పడితే వాడు రావడానికి.. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా?‘భాగమతి’ అడ్డా.. లెక్కలు తేలాలి.. ఒక్కడ్నీ పోనివ్వను’ అంటూ చివర్లో అనుష్క చెప్పే డైలాగ్ మొత్తం ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. ‘భగ.. భగ.. భగ.. భాగమతి’ అంటూ వచ్చే నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.