అదేంటి కవల పిల్లలు ఏడాది తేడాతో పుట్టడమేంటి అనుకుంటున్నారా..?అవును మీరు చదివేది నిజమే. ఈ వింత అమెరికాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తె..కాలిఫోర్నియాకు చెందిన మారియాకు జనవరి 27న ఆస్పత్రి డెలివరీ తేదీని ఖరారు చేశారు డాక్టర్లు.
అయితే సరిగ్గా డిసెంబర్ 31 రాత్రి పురిటీ నొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. 20 నిమిషాల తేడాలో కవలలు జన్మించారు. కానీ సంవత్సరాలే మారిపోయాయి. మొదట బాబు జాక్విన్ డిసెంబర్ 31, 2017 రాత్రి 11:58కి జన్మించాడు. అనంతరం పాప అటాన జనవరి 1, 2018 12:16 గంటలకు జన్మించింది.
దీంతో ఈ కవలల పుట్టిన తేదీలలో ఏకంగా ఏడాది తేడా వచ్చేసింది. ప్రతి వెయ్యి మందిల్లో కేవలం నాలుగు సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుందట. అందులోనూ ఇలా రోజులు, సంవత్సరాలు వేరు కావడం మరింత అరుదు. దీనికి తోడు ఆస్పత్రి యాజమాన్యం సైతం వీరికి గిఫ్ట్‌గా 3వేల డాలర్లను అందజేసింది.