కింగ్ నాగార్జున, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగ్ గెటప్ ఎలా ఉండబోతోందో అనే చర్చ జరుగుతోంది. దీనికి సమాధానంగా నాగ్ తాజా ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో నాగ్ సిక్స్ ప్యాక్ లో అదరగొడుతున్నాడు. వయసు పెరుగుతున్నా నాగ్ లో ఏ మాత్రం ఛార్మ్ తగ్గలేదని, కుర్ర హీరోలకు సైతం అసూయపుట్టేలా నాగ్ శరీరాకృతి ఉందని ఆయన అభిమానులు అంటున్నారు.
తన కొడుకులు కంటే తనకే ఎక్కువ ఫాలోయింగ్ ఉండేలా చేసుకోవడంలో నాగార్జునను మించిన వారు లేరు అనడం అతిశయోక్తి కాదు. వయసు యాభై పదులు దాటినా మొహంలో చార్మ్ తగ్గకుండా యువకులకు కూడా పోటీ ఇచ్చేలా సినిమాలు చేస్తున్న నాగార్జునను గ్రీకు వీరుడు అని ఊరికే అనలేదు. నిన్నే పెళ్ళాడతా సినిమా కోసం సీతారామశాస్త్రిగారు ఏ ముహూర్తంలో ఈ పదం నాగ్ కోసం వాడారో కాని అప్పటి నుంచి ఆ ట్యాగ్ ఇంకెవరికి సూట్ కావడం లేదు.
లాస్ట్ ఇయర్ రాజు గారి గది 2 సక్సెస్ – చైతు పెళ్లి – హలో మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ తో హ్యాపీగా గడిపిన నాగార్జున ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తో చేస్తున్న మూవీలో బిజీ బిజీగా ఉన్నాడు. చాలా గ్యాప్ తర్వాత నాగార్జున పోలీస్ గా నటిస్తున్న సినిమా ఇదే. దీనికి సంబంధించి నాగ్ పర్సనల్ గా షేర్ చేసుకున్న ఈ పిక్ నెటింట్లో హల్‌చల్ చేస్తుంది. మరోవైపు ఈ ఫొటోపై ‘2018 నాగ్ ఆర్జీవీ 4’ అని రాసుంది.
లేట్ ఏజ్ లో బాడీ ని బాలన్స్ చేసుకోవడమే కష్టం అనుకుంటే నాగ్ మాత్రం ఏకంగా సిక్స్ ప్యాక్ చేసి చూపించాడు. కొత్త సంవత్సరం సందర్భంగా తన ఫాన్స్ కోసం చొక్కా లేకుండా ఛాతిని ప్రదర్శిస్తూ ఆరు పలకల దేహాన్ని నాగ్ చూపించిన తీరుకి ఫాన్స్ మాత్రమే కాదు అందరూ వారెవ్వా అంటున్నారు. తక్కువ బడ్జెట్ లో జెట్ స్పీడ్ తో రూపొందుతున్న ఈ మూవీతో తాను మళ్ళి ఫాంలోకి వస్తాను అని వర్మ బలంగా చెబుతున్నాడు. చరిత్ర సృష్టించిన శివ తర్వాత వర్మ-నాగ్ కాంబోలో వచ్చిన అంతం, గోవిందా గోవిందా డిజాస్టర్స్ గా మిగిలాయి. ఇది మాత్రం గన్ షాట్ హిట్ కొట్టి చూపిస్తాను అంటున్నాడు వర్మ.