పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ అజ్ఞాతవాసి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ బ్యాక్ టు బ్యాక్ హిట్‌ని సొంతం చేసుకున్నాయి. తాజాగా సంక్రాంతి కానుకగా నవరి 10న ముచ్చటగా మూడోసారి వస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న న్యూసైన సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతోంది. న్యూ ఇయర్ కానుకగా పవన్ పాడిన కొడకా..కోటేశ్వరరావు అనే పాటు యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్‌తో పాటు మెగాఫ్యామిలీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇప్పటికే యూఎస్‌లో ఎక్కువ థియేటర్లలో విడుదలవుతున్న భారతీయ సినిమాగా అజ్ఞాతవాసి రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖుల కోసం ఈ సినిమా స్పెషల్ షో వేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారట.
విడుదలకి రెండు రోజుల ముందు స్పెషల్ షో వేయాలని భావించి ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మెగా ఫ్యామిలీతో పాటు, మిగతా మెగా హీరోలంతా కూడా ఈ స్పెషల్ షోకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.