అమ్మను మించిన దైవమే లేదు అనే మాటను బలంగా నమ్మిన ఎన్ ఆర్ ఐ, రామ్మోహన్ కొమండూరి తన తల్లి రాధ పేరు పై రాధా మీడియా ఇన్కార్పోరేషన్ని డాలస్, అమెరికాలో స్ధాపించారు. తన తల్లి చేతుల మీదుగా ప్రారంభించిన చిత్రం ఎ టు ఎ (అమీర్ పేట్ టు అమెరికా). శ్రీమతి స్వప్న కొమండూరి సమర్పణలో మదన్ కొమండూరి, పద్మజ కొమండూరి నిర్మించగా భానుకిరణ్ చల్లి దర్శకత్వంలో వహిస్తున్నారు. అరుణ్ ఐకెసి, జిఎల్ బాబు డిఓపీలుగా వ్యవహరిస్తున్నారు. కార్తీక్ కొడకండ్ల సంగీతంతో ప్రవీణ్ పూడి ఎడిటర్ గా రూపొందిన ఎ టు ఎ చిత్రానికి కర్త, కర్మ, క్రియ రామ్మోహన్ కొమండూరి. ఇంత వరకు ఏ చిత్రానికి లేని విధింగా ఈ కర్త, కర్మ, క్రియ అనే పద ప్రయోగానికి కారణం .. ప్రి ప్రొడక్షన్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్నీ క్రాఫ్ట్స్‌లో తన సహాయ సహకారాలను అందిస్తూ, పూర్తి ఇన్వాల్వ్మెంట్ తో ఆయన ఈ ఎ టు ఎ చిత్రాన్ని రూపిందించారు.
ఇనార్బిట్ మాల్ , ప్రసాద్ ఐమాక్స్, హైదరాబాద్ సెంట్రల్ మాల్ లో ఈ చిత్రంలో నుండి బోనాల పాటను, పోతరాజులతో తెలింగాణ సంస్కృతి ఉట్టిపడేట్టుగా మొదటి సారి ఫ్లాష్ మాబ్ లాంటి వినూత్నమైన కార్యక్రమంతో ఆవిష్కరించారు. ఇలాగే కొత్తదనంతో ప్రతి వారం రెండు పాటలు విడుదల చేస్తూ అతి త్వరలో జేఆర్ సి కన్వెన్ష్ హాల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసేందుకు స్నానహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. వీలైనంత వరకు త్వరలో చిత్రన్ని విడుదల చేస్తామని చెప్పారు.
అమీర్‌పేట్ నుండి ఎన్నో ఆశలతో అమెరికాలో అడుపెట్టాలనుకునే యువత ఆలోచనలు,ఆవయాలు ఎలాంటివి? అమెరికా వెళ్లడానికి పడిన చిత్రవిచిత్రమైన సమస్యలు ఎలాంటివి? అనే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం,వేణుమాధవ్,వేణుగోపాల్,వైవా హర్ష లాంటి కమెడియన్స్‌తో కామెడి పండిస్తూ,నవ్వస్తూ,తనికెళ్ల భరణి,రాజేశ్వరి,సమ్మెట గాంధీ,తేజస్,వంశీ కోడూరి,వంశీ కృష్ణ,వంటి నటులతో ఆలోచింపజేసే సీన్స్‌తో అందమైన అమ్మయిలు మేఘనా,పల్లవి దొర,సాషా సింగ్‌లతో ఫుల్లవ్ అండ్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ముస్తాబవుతున్న చిత్రం ఎ టు ఎ. అద్బుతమైన పాటలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టురకునేలా త్వరలో వస్తున్న చిత్రం ఈ ఎ టు ఎ అని దర్శక నిర్మాతలు తెలిపారు.
దాదాపు ఎనభైశాతానికి పైగా అమెరికాలోనే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నరేష్ సుంకిరెడ్డి,మాధవి సుంకిరెడ్డి, రఘు మర్రిపెద్ది, మణి చందన, రజని, మధుసూదన్, యలమంద, సంతోష్, రవితేజ, వెంకట్ బీరం, జీవన్, రమ్య, మహిత, ఆదిత్య, సుచరిత శ్రవణ్, భార్గవి వంటివారు నటించారు. ఈ చిత్రానికి మేకప్ మార్గో, సుస్మిత (అమెరికా).