న్యూఇయర్ వేడుకకు సిద్ధమైన హైదరాబాద్..

238
- Advertisement -

న్యూ ఇయర్ వేడుకలకు కౌంట్ డౌన్ స్టార్టైంది. 2017కు బాయ్ బాయ్ చేప్తూ 2018 గ్రాండ్ వెల్ కమ్ చేప్పేందుకు హైదరాబాద్‌ నగరం రెడీ అవుతోంది. హైదరాబాద్ లో న్యూ ఇయర్ పార్టీస్ అనగానే పబ్బులు, రిసార్టులు, ఓపెన్ ఆడిటోరియం లు గుర్తొస్తాయి. కారణం మిగిలిన మెట్రో సిటీస్ కి భిన్నంగా ఇక్కడ జరిగే ఈవెంట్స్ అనే చెప్పాలి.

2018 Hyderabad

హైదరాబాద్ లో ఉన్న పబ్బులు అందులో బాలీవుడ్ మ్యూజిక్, లైవ్ మ్యూజిక్, ఫైర్ షోస్ , పదికి పైగా టాప్ హోటల్స్, కొన్నిట్లో సెలెబ్రిటీ డాన్సస్ అయితే.. మరి కొన్ని ఫ్యామిలీ స్పెషల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఇక ఓపెన్ ఆడిటోరియమ్స్ లో అయితే వేల జనాల మధ్య డీజే హోరు..ఇలా చెప్పుకుంటూ పోతే నగరం లో ప్రతీది స్పెషలే. ఇక నగరంలో పబ్బులకి పార్టీలకి కోదువే లేదు. రోజు ఏదొక స్పెషల్ డేస్ అంటూ పబ్బులు గ్రాండ్ గా వెల్కమ్ చెప్తూ ఆకర్షిస్తాయి. ఇక న్యూఇయర్‌ వచ్చిందంటే సంతోషానికి కొదవేలేదు.

ఓ వైపు హైదరాబాదీ యువత న్యూ యర్ కోసం పార్టీలు , వాటి కోసం స్కెచ్ లు వేస్తుంటే మరికొంత మంది స్టూడెంట్స్ మాత్రం పార్టీల కంటే ఫ్యామిలీ తో తమ న్యూఇయర్ ఎంజాయ్ చేయటమే ఇష్టమంటున్నారు. అంతటి తో ఫుల్ స్టాప్ పెట్టకుండ ఆలయ సందర్శన, ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేయటం కొత్త కొత్త రిజెల్యూషన్స్ ఫాలో అవ్వటం ఇష్టమంటున్నారు.

2018 Hyderabad

ఇక ఇదిలా ఉండగా.. హైదరాబాద్.. వేల సంవత్సరాలుగా హిందూ ముస్లింల ఐకమత్యం, విభిన్న జాతులు, సంస్కృతులను తనలో ఇముడ్చుకున్న కల్చరల్ సిటీ. ఈ మధ్య నగరం లో జరిగిన ఇంటర్ నేషనల్ ఈవెంట్స్ ఐన సన్ బర్న్, గ్లోబల్ బిజినెస్ మీట్ లో ఇవాంక ఎంట్రీ, ప్రపంచ తెలుగు మహా సభలకు వేదిక గా మారిన తరవాత నుండి ప్రపంచ పటంలో సరి కొత్త గుర్తింపు వచ్చింది.

నయా లుక్ ని సంతరించుకున్న హైదరాబాద్ ఇపుడు న్యూ యర్ వేడుకలకు సిద్ధమైంది. ఇక ఇప్పటికే న్యూ ఇయర్‌ కారణంగా నగరమంతా హై సెక్యూరిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం. అలాగే ఫ్లై ఓవర్స్‌నుంచి రాకపోకలను రద్దు చేయగా రూల్స్‌ ఫాలో అవని వాళ్ళకు తగిన శిక్షలు కూడా విధించనుంది.

- Advertisement -