‘దండుపాళ్యం 3’ ట్రైలర్..

358
Dandupalyam 3 Trailer
- Advertisement -

తెరమీద హత్యలు జరిగే క్రమాన్ని రియలిస్టిగ్గా.. చాలా కొత్తగా చూపిస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. ఆ శైలికి తన క్రియేటివిటీని కూడా జోడించి.. ‘దండుపాళ్యం’ సినిమాను కొత్తగా తీర్చిదిద్దాడు శ్రీనివాసరాజు అనే దర్శకుడు. తెలుగువాడైన ఈ యంగ్ డైరెక్టర్ కన్నడలో తీసిన ‘దండుపాళ్యం’ సెన్సేషనల్ హిట్టయింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా చాలా వైలెంట్ గా.. ‘రా’గా ఈ సినిమాను మలిచిన తీరు కన్నడ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ చిత్రం తెలుగులోకి కూడా అనువాదమై ఇక్కడి ప్రేక్షకుల్ని కూడా మెప్పించింది. దీంతో కొన్నేళ్ల విరామం తర్వాత దీనికి కొనసాగింపుగా ‘దండుపాళ్యం-2’ తీశాడు శ్రీనివాసరాజు. ఈ మూవీ  సీక్వెల్స్‌లో భాగంగా ‘దండుపాళ్యం 3’ చిత్రం రాబోతుంది.

Dandupalyam 3 Trailer

మూడో భాగం షూటింగ్ మొదలుపెట్టేసి కొన్ని నెలల వ్యవధిలోనే ‘దండుపాళ్యం-3’ని రెడీ చేసేశాడు ఈ దర్శకుడు. దీని ట్రైలర్ కూడా వచ్చేసింది. దీన్ని కొత్తగా చూపించేందుకు బ్లాక్ అండ్ వైట్ లుక్ ఇచ్చారు. కేవలం రక్తాన్ని మాత్రం అదే రంగులో చూపించారు. ట్రైలర్ మొత్తం ప్రతి షాట్లోనూ రక్తం చూపించారు. ప్రతి సీన్ చాలా వైలెంట్ గా ఉంది. శృంగార సన్నివేశాల్ని కూడా చాలా పచ్చిగా తీశారు. కొన్ని చోట్ల సన్నివేశాలు మరీ జుగుప్స కలిగించేలా ఉన్నాయి. దండుపాళ్యం గ్యాంగ్ ‘శాడిజం’ పీక్స్ కు వెళ్లిపోయినట్లుగా అనిపిస్తోంది.ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘దండుపాళ్యం3’ ట్రైలర్‌ విడుదల ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. ”ఈరోజు ట్రైలర్‌ విడుదల చేశాం. చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. జనవరి 25న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం” అన్నారు.

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌ జన్యా, సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, ఎడిటింగ్‌: రవిచంద్రన్‌, నిర్మాత: రజనీ తాళ్ళూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరాజు.

https://youtu.be/oO4G_xPx-9o

- Advertisement -