2017…గ’ఘన’ తలంపై ఇస్రో

306
The sky is the limit? Not for the ISRO
- Advertisement -

అంతరిక్ష ప్రయోగంలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతునే ఉంది.  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) 2017లో సరికొత్త చరిత్రను లిఖించింది.ఇస్రో 55 ఏళ్ల ప్రయాణంలో అనేక మైలురాళ్లు. 1962లో ఇండియన స్పేస్‌ ప్రోగ్రామ్‌గా ప్రారంభమై 1965 ఆగస్టు 15న పేరు మార్చుకుని భారత అంతరిక్ష పరిశోధన సంస్థగా అవతరించింది. అంతరిక్షంలో అద్భుత విజయాలు సాధిస్తూ ప్రపంచాన్నే అబ్బురపరుస్తోంది. ఐదు తరాల వాహక నౌకలతో ఇంతింతై వటుడింతై అన్న చందాన ఇస్రో అంతరిక్ష ప్రస్థానం కొనసాగుతోంది. ఇస్రో సాధించిన విజయాలతో ఆకాశమే చిన్నబోయింది.

ఇందులో 2017కి ప్రత్యేక స్ధానం ఉంది. నెల్లూరులోని శ్రీహరికోట నుంచి ఒకే రాకెట్  ద్వారా 104 ఉపగ్రాహాలను నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో…ఒకే ఉపగ్రహం నుంచి వందకు పైగా ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన దేశంగా ప్రపంచ రికార్డు సృష్టించింది.

The sky is the limit? Not for the ISRO

ముళ్ల బాటతో మొదలైన ఇస్రో ప్రయాణం..అంచెలంచెలుగా అవరోధాలను అధిగమిస్తు చంద్రుడిపై సైతం కాలుమోపే విధంగా చేసింది. అంతరిక్షపరిశోధనల కోసం 1962లో భారత ప్రభుత్వం ఇస్రోను ఏర్పాటు చేసింది.   బెంగళూరులో ప్రధాన కేంద్రం ఉండగా విక్రం సారాభాయిని భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణిస్తారు. ఇండియన్‌ నేషనల్‌ కమిటి ఫర్‌ స్పేస్‌ రిసెర్చిను ఏర్పాటు చేసి….పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్‌కు అవసరమయిన అన్నీ విడిభాగాలు మనదేశంలోనే తయారు చేసే విధంగా సారాభాయి కృషి చేశారు.

ఇస్రో మొత్తం 59 ప్రయోగాలు చేపట్టింది… మన దేశానికి చెందిన 84 ఉపగ్రహాలు, 79 విదేశీ ఉపగ్రహాలనూ విజయవంతంగా నింగిలోకి పంపింది. ఆర్యభట్టతో ఇస్రో తన ప్రయోగాన్ని ప్రారంభించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఇప్పటివరకు 38 సార్లు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపగా 37 విజయవంతమయ్యాయి. అందులో ఒక్కటే గురితప్పింది. చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌లతో పాటు అనేక కీలక విజయాలను అందించిన ఘనత పిఎస్‌ఎల్‌వీ వాహకనౌకకే దక్కుతుంది.

The sky is the limit? Not for the ISRO
ఇస్రో గెలుపు గుర్రంగా గుర్తింపు తెచ్చుకున్న  నౌకల్లో పీఎస్ఎల్‌వీకి ప్రత్యేక స్ధానం ఉంది. 14 మీటర్ల ఎత్తు, 320 టన్నుల బరువుండే పీఎస్‌ఎల్‌వీ (పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌)ను రూపొందించారు. 1860 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలను రోదసిలోకి చేరవేసే సామర్థ్యం ఈ వాహక నౌక సొంతం. 1993లో మొదటి పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం అపజయం పాలైనా.. ఆ తర్వాత జరిగిన 38 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు వరుస విజయాలు సాధించి ఇస్రో పేరు ప్రఖ్యాతులను విశ్వవ్యాప్తం చేశాయి. ఇస్రో గెలుపు గుర్రంగా పీఎస్‌ఎల్వీ పేరొందింది. విదేశీ ఉపగ్రహాలను సైతం ప్రయోగించేలా ఇస్రోకునమ్మినబంటులా మారింది.

బరువైన ఉపగ్రహాలను రోదసిలోకి పంపేందుకు ఇస్రో.. జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(జీఎస్‌ఎల్‌వీ)ని రూపొందించింది. ఈ వాహక నౌకకు క్రయోజనిక్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని తొలిదశలో రష్యా అందజేసింది. ఆ తర్వాత పరిజ్ఞానాన్ని అందించేందుకు నిరాకరించడంతో క్రయోజనిక్‌ ఇంజన రూపకల్పనకు మన శాస్త్రవేత్తలు నడుం బిగించారు. దేశీయ క్రయోజనిక్‌ ఇంజన్లతో ఇప్పటికి 4 జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు నిర్వహించి విజయం సాధించారు.

- Advertisement -