ముద్దుల పోటీలో ఆదివాసీలు..!

282
- Advertisement -

ఊహించని రీతిలో ఒక ఎమ్మెల్యే పెట్టిన పోటీ ఇప్పుడు వైరల్ గా మారింది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక ప్రజాప్రతినిధి తమ వారికి ఆధునిక జీవనశైలి దిశగా అడుగులు వేయించేందుకు పెట్టిన పోటీ ఇప్పుడు ఆసక్తికర వార్తగా మారింది. వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటిగా చెప్పే జార్ఖండ్ లో ఆధునిక జీవనశైలి దిశగా ఆదివాసీలను ప్రోత్సహించటం కోసం ఒక చిత్రమైన పోటీని ఏర్పాటు చేశారు.ఆదివాసీయుల మధ్య ప్రేమ, వారి సమాజంలో మోడ్రనైజేషన్‌ను పెంపొందించేందుకు ముద్దుల పోటీని నిర్వహించారు.

Kiss Competition in Jharkhand

ఈ పోటీలో పాల్గొన్నవారంతా ఆదివాసీయులే కావడం విశేషం. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జంటలు ఒకరికొకరు గాఢంగా ముద్దులు పెట్టుకున్నారు. వారి అభిప్రాయంలో ఇలా చేయడం వలన ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుందట. ఈ ముద్దుల పోటీని ఝార్ఖండ్‌కు చెందిన ఎమ్మెల్యే నసైమన్ మరాండీ నిర్వహించారు. ఇది ఎమ్మెల్యే స్వగ్రామమైన తాల్ పహాడీలో జరిగింది. ఈ కాంపిటీషన్‌లో విశేషమేమంటే ఏ జంట అత్యధిక సమయం ముద్దు పెట్టుకుంటుందో వారిని విజేతగా ప్రకటించారు. ఈ విధంగా ఎంపికైన మూడు జంటలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీయులలో ఆధునిక జీవనశైలిని పెంపొందించేందుకే ఈ ముద్దుల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.

https://youtu.be/ACgumpm5C28

- Advertisement -