నటించిన తొలి సినిమాతోనే యువతరం గుండెల్లో స్థానం సంపాదించారు రేణు దేశాయ్. తొలి ప్రయత్నమే బ్లాక్‌బస్టర్. ఆ తర్వాత కెరీర్ పరంగా బిజీ స్టార్ అయిపోతారని అంతా ఆశించారు. కానీ అభిమానులు తలచినది ఒకటి.. వాస్తవంలో జరిగినది ఇంకొకటి. కెరీర్‌లో కేవలం రెండే రెండు సినిమాలతో సరిపెట్టుకున్నారు రేణు. బద్రి, జానీ… ఆ తర్వాత అస్సలు సినిమాల్లో నటించిందే లేదు. అయితే అలా జరగడానికి కారణాలేంటి అనే విషయంపై రేణు దేశాయ్‌ని ప్రశ్నిస్తే ఏం చెప్పారో తెలుసా? .. కాస్త సర్‌ప్రైజ్ కలిగించే విషయమే అది.
రేణు అసలు సినీ కెరీర్‌లో బిజీ కాకపోవడానికి కారణాలేంటి? అనే విషయాలపై రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. తనకు నటనంటే ఇష్టం లేదని, అనుకోకుండా సినిమాల్లో నటించానని వాస్తవానికి తనకు సినిమా దర్శకురాలిని కావాలని కోరిక ఉందని, తను పవన్ నటించిన బాలు, గుడుంబా శంకర్, ఖుషి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని చెప్పింది రేణూదేశాయ్.
అంతేకాదు కెమెరా వెనకుండి పనిచేయాలని కోరిక అని రేణూదేశాయ్ తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇప్పటికే తాను ఒక సినిమా తీశానని, త్వరలో రెండో సినిమాను తెరకెక్కించబోతున్నానని, ఆ సినిమా స్క్పిప్ట్ వర్క్ కొనసాగుతోందని, త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను త్వరలోనే మొదలు పెడతానని రేణూ దేశాయ్ పేర్కొంది. మొత్తానికి రేణూ దేశాయ్ సినిమాల్లో నటించకపోవడానికి కారణం తనకు నటించడం ఇష్టం లేదని పుల్ క్లారిటీగా చెప్పింది.