బిత్తిరి సత్తిపై దాడి..

321
Bitthiri Satti attacked
- Advertisement -

బిత్తిరి స‌త్తి అంటే తెలియ‌ని వారంటూ ఉండ‌రు.  తీన్మార్ వార్తలతో తెలంగాణ యాసలో, అమాయకపు మాటలతో తెలుగ ప్రేక్షకుల మ‌దిని దోచుకున్నాడు. ఒక విధంగా చెప్పుకోవాలంటే సత్తి వచ్చాకే తీన్మార్ మరింత ఫేమస్ అయింది . అలాంటి బిత్తిరి సత్తిపై దాడి జరిగింది.

bithiri sathi

వీ6 కార్యాలయం ముందే సత్తిపై దాడి జరిగింది. వెంటనే సత్తిని ఆస్పత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు.  దాడిచేసిన వ్యక్తిని సికింద్రాబాద్‌కు చెందిన మణికంఠగా గుర్తించారు. ఓ మెంటల్ కేరక్టర్ సత్తితో తెలంగాణ భాషను అపహాస్యం చేస్తూ.. వీ6 ఛానెల్ భాషను అవమాన పరుస్తున్నదనే తాను సత్తిపై దాడి చేశానని  మణికంఠ చెప్పాడు.సత్తిపై దాడి చేయడానికి ఎప్పటినుంచో చూస్తున్నానని ఒక్కడినే వచ్చినట్లు తెలిపాడు. ఇంతక ముందు ఎప్పుడు బిత్తిరిసత్తిని కలవలేదని చెప్పుకొచ్చాడు. చానల్ సిబ్బంది మణికంఠను పోలీసులకు అప్పగించారు.

- Advertisement -