కంటతడి పెట్టిన పద్మావతి..

242
- Advertisement -

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ యాంకర్‌గా ప్రారంభమైన షో  ‘బాతే విత్ ద బాద్‌షా’. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ పద్మావతి దీపికా పదుకొనే హాజరైంది.  స‌ర‌దా స‌ర‌దా విష‌యాల‌తో పాటు కొన్ని ప్ర‌త్యేక హంగుల‌తో రూపొందించిన ఈ టాక్ షోలో దీపికా భావోద్వేగానికి గురైంది. త‌న త‌ల్లి ఉజ్జ‌లా ప‌దుకునే రాసిన లేఖ‌ను షారుక్ చ‌ద‌వ‌డ‌మే అందుకు కార‌ణం.

తన కుమార్తెపై ప్రేమను తెలుపుతూ, ప్రశంసిస్తూ రాసిన ఆ లేఖను విన్న దీపిక భావోద్వేగానికి గురయ్యారు. షోలో కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

 Deepika Padukone CRY before Shah Rukh Khan
అంతేకాకుండా ఈ కార్య‌క్ర‌మంలో ఆమె పద్మావ‌తి చిత్రం మీద వ‌స్తున్న విమ‌ర్శ‌ల గురించి మాట్లాడింది. విమ‌ర్శ‌లు త‌న‌కు కొత్త విష‌యాలు నేర్పిస్తాయ‌ని, దీంతో త‌న‌కు మాన‌సిక ప‌రిణ‌తి చెందినట్లుగా అనిపిస్తుంద‌ని దీపికా ప‌దుకునే అంది.ప్రజలు నన్ను ఏయే విషయాల్లో విమర్శిస్తుంటారో.. ఆయా కోణాల్లో నన్ను నేను చక్కదిద్దుకోవాలి అనుకుంటుంటా అని చెప్పుకొచ్చింది.

ఓం శాంతి  ఓం సినిమాతో దీపికను బాలీవుడ్‌కు షారుక్‌ పరిచయం చేశారు. ఆ తర్వాత షారుక్‌, దీపికలు కలిసి ‘బిల్లు’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘హ్యాపీ న్యూఇయర్‌’ చిత్రాల్లో నటించారు.

 Deepika Padukone CRY before Shah Rukh Khan

- Advertisement -