పద్మావతిపై మరోసారి స్పందించిన కమల్‌

201
- Advertisement -

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ భన్సాలీ రూపొందించిన పద్మావతి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజ్ పుత్‌ల ఆందోళనల నేపథ్యంలో ఆ చిత్ర విడుదలను నిర్మాతలు తాత్కాలికంగా నిలిపివేశారు. బ్రిటన్ లో సెన్సార్ బోర్డు ఆ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అక్కడ కూడా రాజ్ పుత్ లు ఆందోళనలు చేయడంతో డిసెంబరు 1న ఆ చిత్ర విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. దానికితోడు లండన్ లో ఆ చిత్ర ప్రదర్శనకు సీబీఎఫ్ సీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు.

Kamal Haasan Wants Deepika's Head Saved

ఇక ఈ చిత్రంపై విశ్వనటుడు కమల్ హాసన్ మరోసారి స్పందించారు. ఈ సినిమా విడుదల విషయంలో అందరూ అతి సున్నితంగా వ్యవహరిస్తున్నారన్నాడు. పద్మావతి లో రాణి పద్మిని దేవిగా నటించిన దీపికా పదుకొనే తలను నరికి తెస్తే పదికోట్లు ఇస్తామని రాజ్ పుత్ లు నేత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ పద్మావతి తలను తాను రక్షించుకుంటానని కమల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ‘టైమ్స్ ఢిల్లీ లిట్ ఫెస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కమల్ `పద్మావతి` పై మరోసారి స్పందించారు. ‘‘నేను ‘పద్మావతి’ చిత్రాన్ని చూడలేదు. నేను నటించిన ‘విశ్వరూపం’ చిత్రాన్ని కూడా ఎవరూ చూడలేదు. అయినా సినిమాను నిషేధించాలని చూస్తున్నారు. ఇది చాలా తప్పు. సినిమా విడుదలయ్యాక అందులో అభ్యంతరాలున్నాయంటే నేను అర్థంచేసుకుంటాను. ఇలాంటి విషయంలో మనం అతి సున్నితంగా వ్యవహరిస్తున్నాం. ఓ నటుడిగా దర్శకుడిగా కాదు….భారతీయుడిగా స్పందిస్తున్నాను’ అని కమల్ తన ఆవేదనను వ్యక్తపరిచారు.

- Advertisement -