హీరోగా మహేశ్ మేనల్లుడు

259
Mahesh babu Son-In-Law to Debut in Films
- Advertisement -

సూపర్‌స్టార్‌ మహేశ్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. మహేశ్ బాబు ఒక సినిమా చేస్తున్నాడు అంటేనే అందరి దృష్టి ఆ వైపే ఉంటుంది. ఇక మహేశ్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా తెరపైకి వస్తున్నారని తెలిసినా, అభిమానులు ఎంతో ఆసక్తిని చూపుతుంటారు. మహేష్‌ బావ సుధీర్‌ బాబు హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మహేశ్ మేనకోడలు ఓ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమవుతోందని ఇటీవలే వార్తలు వచ్చాయి. భవిష్యత్తులో ఆమె హీరోయిన్ అవుతుందని కూడా చెప్పుకున్నారు.

Mahesh babu Son-In-Law to Debut in Films

అయితే తాజాగా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరొక హీరో రంగప్రవేశం చేయబోతున్నాడు. మహేష్ బావ.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ తన మామయ్యలాగా సినిమా రంగంలో రాణించాలని ఆశ పడుతున్నాడు. దాంతో హీరో అయ్యేందుకు అవసరమైన అంశాల్లో అశోక్ కు చాలా రోజుల ముందే ట్రైనింగ్ మొదలెట్టేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైనింగ్ అంతా ఓ కొలిక్కి రావడంతో అతడిని హీరోగా లాంచ్ చేసే పనులు మొదలెట్టారు. పెద్ద ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజుకు అశోక్ ను లాంచ్ చేసే బాధ్యతలు అప్పగించబోతున్నారని సమాచారం. అయితే అశోక్ ను ఇంట్రడ్యూస్ చేయడానికి డైరెక్టర్ గా ఎవరిని తీసుకోవాలన్నది ఇంకా డిసైడ్ అవలేదు. కొత్త డైరెక్టర్ తో సినిమా త్వరలో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -