‘లీడర్’ చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రిచా గంగోపాధ్యాయ వరుసగా తెలుగులో సినిమాలు చేసింది. ప్రభాస్, రవితేజ, నాగార్జున తదితర హీరోల సరసన నటించిన రిచా గంగోపాద్యాయ ‘భాయ్’ సినిమా తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని అమెరికా వెళ్లిపోయింది. ఈ భామ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా పెద్ద హీరోల సరసన నటించింది. ఇటు తెలుగులోనే కాక అటు తమిళ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించింది.
అయితే తాజాగా ఈ భామపై ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో వార్తుల షికార్లు పుకార్లు చేస్తున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడిని అమెరికాలోనే రిచా పెళ్లాడినట్లు చెబుతున్నారు. ఈ పెళ్లి ఏ హడావుడి లేకుండా పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య చాలా సింపుల్ గా జరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి.
అయితే తన పెళ్లి విషయంపై రిచా ఘాటుగానే స్పందించింది. ‘‘ఇంగ్లీషు లేదా వ్యంగ్య వ్యాఖ్యలు మీకు అర్థం కాకపోవచ్చు. మీ కోసం ఇక్కడ స్పష్టత ఇస్తున్నా… నేను పెళ్లి చేసుకోలేదు. ఒక వేళ చేసుకుంటే తప్పకుండా నేనే చెబుతాను’’ అని తెలిపింది. అంతేకాదు, ఈ రూమర్లకు తెరలేపిన మీడియాకు కూడా ఆమె చురకలు వేసింది. ‘‘మీడియా నా బోరింగ్ లైఫ్ చూసి నిరుత్సాహపడుతున్నట్లుంది. అందుకే, మసాలాలను దట్టిస్తోంది. దయచేసి, సినిమాల నుంచి రిటైరైన నటుల జీవితాలను వదిలి, క్రియాశీలక సినిమా వార్తలపై దృష్టి పెట్టండి’’ అని పేర్కొంది.
https://twitter.com/richyricha/status/932279557780115456
https://twitter.com/richyricha/status/932288768840790016