సినీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నంది అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రక్రియకి కొంత గ్యాప్ రాగా, ఈ ఏడాది మార్చిలో ఏపి ప్రభుత్వం 2012,2013 సంవత్సరాలకి గాను నంది అవార్డులను ప్రకటించింది. కమిటీ ఛైర్ పర్సన్ జయసుధ 2012 అవార్డుల జాబితాను ప్రకటించగా, 2013 అవార్డుల జాబితాను దర్శకుడు కోడి రామకృష్ణ ప్రకటించారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను నంది అవార్డులు, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య సినిమా పురస్కారాలను ప్రకటించింది. కమిటీ ప్రతినిధులు నందమూరి బాలకృష్ణ, మురళీ మోహన్, గిరిబాబు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
2014 నంది అవార్డులు:
ఉత్తమ చిత్రం- లెజెండ్
ఉత్తమ నటుడు- బాలకృష్ణ (లెజెండ్)
ద్వితీయ ఉత్తమ చిత్రం- మనం
తృతీయ చిత్రం- హితుడు
ఉత్తమ ప్రతినాయకుడు- జగపతిబాబు (లెజెండ్)
ఉత్తమ ఛాయాగ్రాహకుడు- సాయి శ్రీరామ్ (అలా ఎలా)
ఉత్తమ నటి- అంజలి (గీతాంజలి)
కొరియోగ్రాఫర్- ప్రేమ్‌రక్షిత్
ఫైట్‌మాస్టర్-రామ్‌లక్ష్మణ్
ఉత్తమ సహాయ నటుడు- నాగచైతన్య (మనం)
సహాయనటి- మంచులక్ష్మి (చందమామ కథలు)
హాస్యనటుడు- బ్రహ్మానందం (రేసుగుర్రం)
బాలనటుడు- గౌతమ్ కృష్ణ(నేనొక్కడినే)
2015 నంది అవార్డులు:
ఉత్తమ చిత్రం- బాహుబలి-1
ఉత్తమ నటుడు- మహేశ్‌బాబు (శ్రీమంతుడు)
ఉత్తమ కుటుంబ కథా చిత్రం- మళ్లీ మళ్లీ రానిరోజు
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్-కంచె
ఉత్తమ బాలల చిత్రం-దానవీర శూరకర్ణ
ఉత్తమ హాస్యనటుడు- వెన్నెల కిశోర్ (భలేభలే మగాడివోయ్)
ద్వితీయ ఉత్తమ చిత్రం- ఎవడే సుబ్రహ్మణ్యం
ఉత్తమసహాయ నటి- రమ్యకృష్ణ
ఉత్తమ సంగీత దర్శకుడు- కీరవాణి
స్పెషల్ జ్యూరీ అవార్డు- విజయ్ దేవర కొండ
ఉత్తమపాటల రచయిత- రామజోగయ్య శాస్త్రి (శ్రీమంతుడు)
2016 నంది అవార్డులు:
ఉత్తమ చిత్రం: పెళ్లి చూపులు
ఉత్తమ నటుడు- జూనియర్ ఎన్టీఆర్
ఉత్తమ దర్శకుడు- సతీశ్ వేగేశ్న (శతమానం భవతి)